జగన్ బిగ్ ట్విస్ట్..ఎంపీలుగా మంత్రులు?

వచ్చే ఎన్నికల్లో పనిచేయని కొందరికి సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని జగన్ పదే పదే చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. సరైన పనితీరు కనబర్చని నేతలని సైడ్ చేస్తానని అంటున్నారు. అయితే పనితీరు సరిగ్గా లేకుండా ప్రజా వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేల లిస్ట్ ఎక్కువగానే ఉందని తెలిసింది. ఇందులో కొందరు మంత్రులు కూడా ఉన్నారని సమాచారం. అయితే అలా అందరికీ సీట్లు ఇవ్వకపోవడం కూడా ఇబ్బందే.

దీని వల్ల పార్టీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి. అందుకే జగన్ కొందరి సీట్లు మార్చే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో సరిగ్గా పనిచేయని మంత్రులకు ఎమ్మెల్యే సీట్లు కంటే ఎంపీ సీట్లు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. ఒక మంత్రికి సీటు ఇవ్వకపోతే ఆ ప్రభావం పార్టీపై పడుతుంది. అలా కాకుండా వారిని ఎంపీలుగా పంపే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే తాజాగా వస్తున్న కథనాల ప్రకారం..ఇద్దరు మంత్రులని ప్రస్తుతం ఎంపీలుగా పంపే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

జగన్ కేబినెట్ లో ఎక్కువ వ్యతిరేకత ఎదురుకుంటున్న మంత్రి గుమ్మనూరు జయరాంకు..వచ్చే ఎన్నికల్లో ఆలూరు సీటు ఇచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. ఇప్పటికే అక్కడ టి‌డి‌పి నుంచి తీసుకొచ్చిన ఓ నాయకురాలుకు సీటు ఇవ్వాలని డిసైడ్ అయినట్లు తెలుస్తుంది. దీంతో జయరాంని కర్నూలు ఎంపీగా బరిలో దింపే ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది.

ఇక ఇటీవల పవన్ అభిమానులకే కాదు..తనకు కూడా పవన్ సి‌ఎం అయితే చూడాలని ఉందని కామెంట్ చేసిన మంత్రి పినేపే విశ్వరూప్‌ని సైతం సైడ్ చేస్తున్నట్లు తెలిసింది. అలా కామెంట్ చేయడం వల్ల ఈయన జనసేనలోకి వెళుతున్నారనే ప్రచారం వస్తుంది. పైగా ఈయనకు అమలాపురం అసెంబ్లీలో పాజిటివ్ లేదు. దీంతో జగన్..ఈయన్ని ఈ సారి అసెంబ్లీ బరిలో కాకుండా పార్లమెంట్ బరిలో పెడతారని తెలిసింది.