రాజమౌళి డైరెక్టర్ కాకపోయి ఉంటే ఏమయ్యోవారో తెలుసా..?

తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ గా పేరుపొందిన రాజమౌళి కెరియర్ లోనే ఇప్పటివరకు ఫ్లాప్ సినిమానే లేదని చెప్పవచ్చు. రాజమౌళి తెలుగు సినీ పరిశ్రమల ప్రపంచ దేశాలకు పరిచయం చేసిన ఘనత ఆయనదే.. బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా సత్తా చాటిన రాజమౌళి..RRR సినిమాతో గ్లోబల్ స్థాయిలో కూడా పేరు సంపాదించారు. ఆస్కార్ అవార్డు కూడా అందుకోవడం జరిగింది.అందుకే రాజమౌళితో సినిమా చేయడానికి ఎక్కువగా నటీనటులు సైతం మక్కువ చూపుతూ ఉంటారు.

SS Rajamouli's Love Story: From Marriage With A Divorcee To Helping Her  Become A Renowned Designer
అయితే రాజమౌళి గతంలో ఒకానొక సమయంలో సినిమాలు అవసరమా అని అనుకున్నారట.. ఈ విషయాన్ని ఒక ఇంటర్వ్యూలో తెలియజేయడం జరిగింది రాజమౌళి. సినిమా కాకుండా ఏదైనా ఒక ఉద్యోగం చేస్తే మంచిది కదా అనుకున్నట్టుగా తెలియజేయడం జరిగింది.. 1991లో తనకు డైరెక్టర్ కావాలని కోరిక ఉండేదట. ఆ సమయంలో డైరెక్టర్ గా తాను సక్సెస్ అవుతానని చాలా కాన్ఫిడెంట్ గా ఉండేదని ..కానీ మధ్యలో ఒక ఏడాది పాటు అసలు సినిమాలు తీయడం అవసరమా అనిపించిందట.దీంతో ఆ కాన్ఫిడెంట్ పూర్తిగా తగ్గిపోయిందని తెలిపారు

సినిమాలలో ఎంట్రీ ఇస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతామని గ్యారెంటీ ఉండేది కాదని దాని బదులుగా ఉద్యోగం చేయడం బెటర్ అనుకున్నారట. కానీ ఆ తర్వాత మళ్లీ ఎప్పుడు కూడా అలాంటి ఆలోచన తనకి తట్టలేదని తెలిపారు. అయితే అలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందంటే రాజమౌళి ఆ సమయంలో ప్రేమలో ఉన్నట్లు సమాచారం..వివాహం తర్వాత తమతో వచ్చిన అమ్మాయిని పోషించాల్సి ఉంటుంది అలాంటప్పుడు సినిమా నిలబడలేకపోతే ఎలా అని ఆలోచించినట్లు తెలుస్తోంది రాజమౌళి. అంతేకాకుండా వివాహమైన తర్వాత ఎక్కువగా షూటింగ్స్ కి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది…ఇక అలాంటి సమయంలో భార్యతో ఎలాంటి ఇబ్బందులు తలెత్తుతాయని ఆలోచించిన రాజమౌళి ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నారట.కానీ రాజమౌళి తన భార్య కూడా తనకి సపోర్టుగా నిలుస్తూ ఉండడంతో ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నారంటూ తెలిపారు.