వారాహితో పవన్..తమ్ముళ్ళల్లో టెన్షన్..ఆ సీట్లే డౌట్!

ఎన్నికల సమయం దగ్గరపడటంతో జనసేన అధినేత పవన్ సైతం ఇంకా జనంలోకి రావడానికి ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. ఇంతకాలం సినిమా షూటింగ్‌ల్లో బిజీగా ఉన్న పవన్..ఇప్పుడు వారాహి బస్సుతో ప్రజల్లోకి వస్తున్నారు. జనసేనని బలోపేతం చేసే దిశగా ఆయన యాత్ర కొనసాగనుంది. ఇప్పటికే ఆయన షెడ్యూల్ ఫిక్స్ అయిన విషయం తెలిసిందే. జూన్ 14న అన్నవరంలో పూజలు తర్వాత..ప్రత్తిపాడు నుంచి ఆయన పాదయాత్ర కొనసాగనుంది.

ప్రత్తిపాడు తర్వాత పిఠాపురం, కాకినాడ, కాకినాడ రూరల్‌, ముమ్మిడివరం, అమలాపురం, పి.గన్నవరం, రాజోలు తర్వాత నరసాపురం, పాలకొల్లు, భీమవరం నియోజకవర్గాల్లో యాత్ర  కొనసాగుతుంది. అయితే దాదాపు పవన్ జనసేనకు పట్టున్న స్థానాల్లోనే యాత్ర చేయనున్నారు. అదే సమయంలో టి‌డి‌పితో పొత్తు ఫిక్స్ అయిన వేళ..జనసేన అడిగే సీట్లలోనే ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. కాకపోతే ఈ సీట్లలో టి‌డి‌పికి బలం ఎక్కువే. కాబట్టి ఈ సీట్లని త్వరగా వదులుకోవడానికి నేతలు రెడీగా ఉండకపోవచ్చు. ఇక వీటిల్లో ప్రత్తిపాడు, ముమ్మిడివరం, కాకినాడ సిటీ, పాలకొల్లు లాంటి సీట్లు టి‌డి‌పి వదలడం కష్టం..అందులో ఎలాంటి డౌట్ లేదు.

మిగిలిన సీట్లలో కూడా టి‌డి‌పి నేతలు స్ట్రాంగ్ గా ఉన్నారు..కానీ పొత్తులో కొన్ని త్యాగాలు తప్పవు. కాబట్టి కొన్ని సీట్లు వదులుకున్న మిగిలిన సీట్లు టి‌డి‌పి వదులుకోవడం కష్టమే. అయితే పవన్ యాత్ర చేయడం వల్ల ఆయా సీట్లలో జనసేన నాయకులు యాక్టివ్ అవుతారు. దీంతో టి‌డి‌పి నేతలకు పోటీ పెరిగింది. సీట్ల విషయంలో పోటీ పెరగవచ్చు. మొత్తానికైతే పవన్ యాత్ర టి‌డి‌పిలో టెన్షన్ పెంచే ఛాన్స్ ఉంది.