గత కొద్ది రోజుల క్రితం గీత ఆర్ట్స్ బ్యానర్ నిర్మాత అల్లు అరవింద్ రామాయణం చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు ప్రకటించినట్లు తెలుస్తోంది.. అల్లు అరవింద్ ఎన్నో వైవిధ్యమైన చిత్రాలను తెరకెక్కిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా మళ్లీ అల్లు అరవింద్ నిర్మిస్తున్న రామాయణం గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.. ముఖ్యంగా ఇందులో సాయి పల్లవి సీత పాత్రలో నటించబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ప్రభాస్ హీరోగా రామాయణ కథ ఆధారంగా అది పురుష్ చిత్రాన్ని నిర్మించారు ఈ సినిమా ఈనెల 16న విడుదల కాబోతోంది.
రామాయణం కొత్త ప్రాజెక్టును బాలీవుడ్ డైరెక్టర్ నితీష్ తివారి దర్శకత్వం వహించబోతున్నట్లు సమాచారం.ఈ సినిమాలో రాముడిగా రణబీర్ కపూర్ కనిపిస్తూ ఉండగా రావణుడి పాత్రలో హృతిక్ రోషన్ చేయబోతున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రాజెక్టు ఇంకా అధికారికంగా ప్రకటించాల్సి ఉన్నది. ప్రస్తుతం డైరెక్టర్ నితీష్ తివారి ఒక సినిమాని పూర్తిచేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ సినిమా అయిపోయిన వెంటనే రామాయణం సినిమాపై ఫోకస్ పెట్టబోతున్నట్లు తెలుస్తోంది. రామాయణం చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్ చివరి కల్లా సెట్స్ పైకి తీసుకురావాలని డైరెక్టర్ నితీష్ భావిస్తున్నట్లు సమాచారం.
ఒకవేళ సీత పాత్రలో సాయి పల్లవి నటించకపోతే మరొక బాలీవుడ్ హీరోయిన్ ని సెట్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతలుగా నితీష్ తివారి మధు వంతెన.. అల్లు అరవింద్ వ్యవహరిస్తున్నట్లు సమాచారం.. రావణుడి పాత్ర కోసం పలు రకాల టెస్టులు కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో కేజిఎఫ్ స్టార్ హీరో యష్ కూడా రావణుడి పాత్రలో నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రానికి సంబంధించి కార్యక్రమాలు త్వరలోనే అఫీషియల్ గా వెలుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.