గుడుంబా శంకర్ చిత్రంలో స్టార్ హీరోయిన్ నటించిందని తెలుసా..?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రాలలో అట్టర్ ప్లాప్ సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.. అలాంటి వాటిలో గుడుంబా శంకర్ సినిమా కూడా ఒకటి. ఈ సినిమా అప్పట్లో ఆడియన్స్ ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.. కానీ బుల్లితెరపై ప్రసారమయ్యిందంటే చాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునే విధంగా కనిపిస్తూ ఉంటుంది. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ కామెడీ టైమింగ్ ఒక రేంజ్ లో ఉందని చెప్పవచ్చు. అప్పట్లో ఈ సినిమా ఫ్లాప్ అయ్యుండొచ్చు కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లే కి ప్రముఖ డైరెక్టర్ శ్రీనువైట్ల వ్యవహరించడం వల్ల 10 సంవత్సరాల పాటు తన సినీ కెరియర్ను ముందుకు సాగించారు.

పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ చిత్రానికి స్క్రీన్ ప్లే అందించారు. ఈ సినిమాలోని ప్రతిపాట అందరిని ఆకట్టుకున్నాయి.. ఇందులో హీరోయిన్గా మీరాజాస్మిన్ నటించింది. ఈ చిత్రంలోని స్పెషల్ సాంగ్లో నటించిన అమ్మాయి ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. ఇంతకు ఆమె ఎవరో కాదు నతాన్య సింగ్ తెలుగు లో ఇమే పెద్దగా నటించలేదు.. కన్నడలో మాత్రం స్టార్ హీరోయిన్గా పేరు సంపాదించి అక్కడ స్టార్ హీరోలా చిత్రాలలో నటించింది.


ముఖ్యంగా ఉపేంద్ర, కిచ్చా సుదీప్, శివరాజ్ కుమార్ వంటి నటులతో కూడా ఈమె కలిసి నటించింది. 2008 వ సంవత్సరంలో ఉపేంద్ర హీరోగా నటించిన బుద్ధిమంత చిత్ర మే ఈమె ఆఖరి చిత్రం. ఆ తర్వాత మళ్లీ ఏ సినిమాలలో కూడా నటించలేదు. కానీ ఈమెకు సంబంధించి కొన్ని ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. స్టార్ హీరోయిన్ అయినప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ చిత్రంలో ఐటెం సాంగ్ లో నటించిన ఈ ముద్దుగుమ్మ తెలుగులో సక్సెస్ కాలేక పోయింది.