పొత్తులపై పవన్ క్లారిటీ కానీ..సీఎం పదవి అందుకే?

పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే టీడీపీ, బి‌జే‌పిలతో కలిసే ముందుకెళ్లాలనేది పవన్ ఆలోచన చేస్తున్నారు. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే జనసేనకు ఉన్న బలం ఏంటో ఆయనకు తెలుసు..ఆ బలంతో 10 సీట్లు గెలుచుకోవచ్చు గాని అధికారం లోకి రావడం అనేది జరిగే పని కాదు.

అందుకే టి‌డి‌పి, బి‌జే‌పి మద్ధతు కావాలని అంటున్నారు. కాకపోతే ఆ మధ్య పొత్తుల గురించి మాట్లాడి..సి‌ఎం పదవిపై తనకు ఆశ లేదని, బలం లేకుండా సి‌ఎం పదవి అడగకూడదని చెప్పుకొచ్చారు. దీంతో పవన్ ఫ్యాన్స్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పవన్ సి‌ఎం పదవి తీసుకోకపోతే తాము ఓటు నోటాకు కూడా వేస్తామని చెప్పిన వారు ఉన్నారు. దీంతో ఫ్యాన్స్ అసంతృప్తికి గురవుతున్నారని పవన్‌కు అర్ధమైంది. అందుకే ఈ మధ్య తనకు సి‌ఎం అయ్యే ఛాన్స్ ఇవ్వాలని, జనసేన ప్రభుత్వం వస్తుందని మాట్లాడుతున్నారు. పొత్తుల గురించి ఆయన ప్రస్తావించడం లేదు. తమ పార్టీని బలోపేతం చేసుకునే అంశంపైనే మాట్లాడుతున్నారు.

అయితే పవన్ ఒంటరిగా వెళితే జనసేన గెలవలేదు..అలాగే సి‌ఎం కాలేరు. ఆ విషయం పవన్‌కు తెలుసు.కాకపోతే అభిమానుల కోసమే తాను సి‌ఎం అవుతానని మాట్లాడుతున్నట్లుగా పవన్ చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్తితుల్లోనూ పొత్తు ఉండాలనేది తన అభిప్రాయమని అంటున్నారు. టి‌డి‌పి, జనసేన, బి‌జే‌పి కలవాలని కోరుకుంటానని చెబుతున్నారు.

ఈ బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది భవిష్యత్ లో తెలుస్తుందని అంటున్నారు. మొత్తానికి మాత్రం పొత్తులతోనే పవన్ ముందుకెళ్తారని తెలుస్తుంది. అప్పుడు సి‌ఎం సీటుపై ఏం చేస్తారనేది చూడాలి.