మోదీ..డైరక్ట్ కేసీఆర్‌ని ఎందుకు టార్గెట్ చేశారు.!

విపక్షాల ఐక్యతతో దేశంలో బి‌జే‌పికి కాస్త ఇబ్బందులు మొదలైనట్లు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కేంద్రంలో తిరుగులేని పొజిషన్ లో ఉన్న మోదీ సర్కార్‌కు విపక్షాల ఐక్యత రూపంలో ఓ భారీ కుదుపు కనిపిస్తుంది. విపక్షాల కూటమి కట్టడాన్ని మోదీ తెలిగా వదిలేస్తున్నట్లు లేరు. విపక్షాలు అదే విధంగా కలిసి ముందుకెళితే రానున్న కాలంలో తమకే ఇబ్బంది అని అర్ధమైంది. అందుకే డైరక్ట్  విపక్షాలని మోదీ టార్గెట్ చేశారు.

తాజాగా భోపాల్ లో బీజేపీ బూత్ లెవెల్ నేతలు, కార్యకర్తలతో మోదీ సమావేశమయ్యారు. త్వరలో తెలంగాణ సహ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో…మోదీ కార్యకర్తలతో సమావేశమై ప్రతిపక్షాలపై విమర్శలు గుప్పించారు. ఇటీవల పాట్నాలో విపక్షాల కూటమి సమావేశం జరిగింది. అందులో పాల్గొన్న వారంతా అవినీతి పార్టీలే అని ఆరోపించారు. రూ. 20 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిన వారు కలిశారని అన్నారు. అదే సమయంలో సోనియా గాంధీ కుటుంబం సంక్షేమం కోరుకుంటే కాంగ్రెస్‌కు ఓటేయండి..ములాయంసింగ్ కుమారుడు అభివృద్ధి కావాలంటే సమాజ్‌వాద్ పార్టీకి ఓటు వేయండి..లాలూ ప్రసాద్, కరుణానిధి ఫ్యామిలీలు అంటూ మోదీ కామెంట్ చేశారు. ఇక కేసీఆర్ కుమార్తె బాగుండాలంటే బి‌ఆర్‌ఎస్‌కు ఓటు వేయండి..అదే మీ పిల్లల భవిష్యత్, దేశ భవిష్యత్ బాగుండాలంటే బి‌జే‌పికి ఓటు వేయాలని మోదీ పిలుపునిచ్చారు.

అయితే ఇంతవరకు ఏ విపక్ష నేత పేరు కూడా మోదీ ప్రస్తావించకుండా విమర్శలు చేసేవారు. ఇప్పుడు డైరక్ట్ ప్రస్తావిస్తున్నారంటే పరిస్తితి మారింది అని చెప్పవచ్చు. విపక్షాలతో బి‌జే‌పికి ముప్పు మొదలైనట్లే కనిపిస్తుంది. అదే సమయంలో విపక్షాలతో కే‌సి‌ఆర్ కలవలేదు. అయినా సరే మోదీ..కే‌సి‌ఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేశారు. అంటే తెలంగాణలో కే‌సి‌ఆర్ సర్కార్‌ని గద్దె దించాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే ఆయన కే‌సి‌ఆర్ ని టార్గెట్ చేసినట్లు తెలుస్తుంది.