`దేవ‌ర‌`లో ఎన్టీఆర్ భార్య‌గా బంప‌ర్ ఆఫ‌ర్‌ కొట్టేసిన సాయి ప‌ల్ల‌వి.. ఈ క్లారిటీ స‌రిపోతుందా?

యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ప్ర‌స్తుతం `దేవ‌ర‌` మూవీతో బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. `ఆర్ఆర్ఆర్‌` వంటి ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ మూవీ త‌ర్వాత ఎన్టీఆర్ నుంచి రాబోతున్న చిత్ర‌మిది. కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే సైఫ్ అలీ ఖాన్ ఇందులో విల‌న్ గా క‌నిపించ‌బోతున్నారు.

ఎన్టీఆర్ ఆర్ట్స్‌, యువ‌సుధ ఆర్ట్స్ బ్యాన‌ర్ల‌పై అత్యంత భారీ బ‌డ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో నిర్మిత‌మ‌వుతున్న ఈ చిత్రం వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ విడుద‌ల కానుంది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్ లో ఈ మూవీ షూటింగ్ జ‌రుగుతోంది. కోస్టల్‌ ఏరియాలో గుర్తింపుకి నోచుకోని ఓ గ్రామం బ్యాక్ డ్రాప్‌లో ఈ సినిమా సాగుతుంది. అయితే ఈ సినిమాలో న్యాచుర‌ల్ బ్యూటీ సాయి ప‌ల్ల‌వి బంప‌ర్ ఆఫ‌ర్ కొట్టేసింద‌ని గ‌త రెండు రోజుల నుంచి పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రుగుతోంది.

దేవ‌ర మూవీలో ఎన్టీఆర్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని.. తండ్రీకొడుకులుగా ఆయ‌న న‌టిస్తున్నార‌ని టాక్ ఉంది. అయితే తండ్రి పాత్ర‌కు భార్య‌గా సాయి ప‌ల్ల‌వి క‌నిపిస్తుంద‌ని నెట్టింట తెగ చ‌ర్చించుకుంటున్నారు. అయితే తాజాగా ఈ విష‌యంపై చిత్ర టీమ్ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. దేవ‌ర సినిమాలో ఎన్టీఆర్ భార్య‌గా సాయి ప‌ల్ల‌వి క‌నిపించ‌బోతోంది అని వ‌స్తున్న వార్త‌ల్లో నిజం లేద‌ని తేల్చేసింది. ఈ మేర‌కు `నో` అంటూ ట్వీట్ చేసింది. దీంతో అస‌లు నిజం తేలిపోయింది.