నిఖిల్ స్పై సినిమా బాక్సాఫీస్ టార్గెట్ అందుకొనేనా..?

యంగ్ హీరో నిఖిల్ నటిస్తున్న తాజా చిత్రం స్పై.. ఈ చిత్రం రేపటి రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఈ సినిమా సుభాష్ చంద్రబోస్ మిస్టరీ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిస్తూ ఉన్నారు డైరెక్టర్ గ్యారీ బి హెచ్. నిర్మాత రాజశేఖర్ ఈ సినిమా కథను అందించడం జరిగింది. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో విడుదల చేయబోతున్నారు.ఇప్పటికే ఈ సినిమా బుకింగ్ ఓపెనింగ్స్ని చేయగా తొమ్మిది నిమిషాలలోనే క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. కార్తికేయ-2 చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న నిఖిల్ ఈ సినిమాతో అదే తరహాలో కలెక్షన్లను కూడా బాక్సాఫీస్ వద్ద రూ.120 కోట్లకు పైగా రాబట్టి మంచి విజయాన్ని అందుకున్నారు.

Spy Movie (Jun 2023) - Trailer, Star Cast, Release Date | Paytm.com

ఈసారి స్పై సినిమాతో మరొక కొత్త ఫలితాన్ని అందుకుంటారా లేదా అనే విషయంపై అభిమానులు ప్రేక్షకుల సైతం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా కూడా పూర్తిస్థాయిలో కంటెంట్తో క్లిక్ అయితే కలెక్షన్ల పరంగా సునామి సృష్టిస్తుందని చెప్పవచ్చు.. ఇప్పటివరకు ట్రైలర్ బాగానే ఉన్నప్పటికీ మిగతా భాషల్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోతోంది .నిఖిల్ కంటెంట్ తో మంచి టాక్ సొంతం చేసుకుంటే మళ్ళీ కార్తికేయ-2 వంటి మ్యాజిక్ రిపీట్ అవుతుందని చెప్పవచ్చు.

ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బిజినెస్ విషయానికి వెళ్తే రెండు తెలుగు రాష్ట్రాలలో రూ .13 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరిగినట్లు తెలుస్తోంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో చూసుకుంటే 70 లక్షల రేంజ్ లో పలికినట్లు. మిగతా భాషలలో దాదాపుగా రూ .2కోట్ల వరకు బిజినెస్ జరిగినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా స్పై సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే రూ.17.50 కోట్ల రూపాయలు జరిగినట్లు తెలుస్తోంది.ఈ సినిమా టార్గెట్ కేవలం రూ .18 కోట్లు మాత్రమే ఉన్నట్లు తెలుస్తోంది.సినిమా సక్సెస్ అయితే ఈ కలెక్షన్స్ కేవలం రెండు రోజుల లోపల వస్తాయని చెప్పవచ్చు. మరి ఏ మేరకు ఈ సినిమా టార్గెట్ ని ఫినిష్ చేస్తుందో చూడాలి.