బాలయ్యతో రొమాన్స్ కు సై అంటున్న రకుల్ ..?

టాలీవుడ్ లో క్యూట్ హీరోయిన్గా గతంలో మంచి పాపులారిటీ సంపాదించింది రకుల్ ప్రీతిసింగ్. ఈమధ్య రకుల్ ప్రీతిసింగ్ సినిమాలు పెద్దగా సక్సెస్ కాలేకపోతున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చి బాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన అక్కడ సినిమా అవకాశాలు అయితే వస్తూ ఉన్న సరైన సక్సెస్ మాత్రం అందుకోలేక పోతోంది. కానీ తన గ్లామర్ తో మాత్రం తన పేరుని పాపులారిటీ చేసుకునేందుకు పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Can She Accept Balayya & BS Film? | cinejosh.com
తెలుగులో ఈమె నటించిన చిత్రాలలో మన్మధుడు-2 తర్వాత సరైన అవకాశాలు అందుకోలేకపోయింది. ఆ తర్వాత నితిన్ తో చెక్ సినిమా లో నటించిన అది కూడా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత కొండ పొలం సినిమా కూడా డిజాస్టర్ గా మిగిలింది. దీంతో ఈమె డిమాండ్ భారీగా తగ్గిపోయిందని చెప్పవచ్చు. దీంతో టాలీవుడ్ లో ఎలాంటి అవకాశం వచ్చిన వదులుకోకుండా ఉండేందుకు మాస్ హీరోకి ఓకే చెప్పేందుకు సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బాబీ దర్శకత్వంలో బాలకృష్ణ ఒక సినిమా చేయబోతున్నారు ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

అయితే ఈ చిత్రంలో హీరోయిన్గా సంయుక్త మీనన్ ఫైనల్ అయినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. కానీ మరొక హీరోయిన్ పాత్ర కోసం రకుల్ ప్రీతిసింగ్ ని సంప్రదిస్తున్నట్లు సమాచారం.. సంయుక్త కంటే రకుల్ ప్రీతిసింగ్ మాత్రమే కాస్త బెటర్ గా ఉంటుందని తెలుస్తోంది.. ఒకవేళ ఇదే కనుక నిజమైతే బాలయ్యతో రొమాన్స్ చేయడానికి అయినా రకుల్ ప్రీతిసింగ్ వెనుకడుగు వేయడంటూ పలువురు నేటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ సినిమా కోసం రకుల్ ప్రీతిసింగ్ చిత్ర బంధం సంపాదిస్తుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉన్నది.