నందమూరి ఫ్యామిలీ నుంచి కొత్తగా హీరో ఎంట్రీ.. అతడు సక్సెస్ అయ్యేనా…

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఎంతో ప్రత్యేకత ఉందనే విషయం అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయంలో ఆ ఫ్యామిలీ నుండి ఎవరైనా ఒక హీరో ఎంట్రీ ఇస్తే నందమూరి అభిమానులకే కాకుండా ప్రేక్షకులందరిలో కూడా చాలా ఆసక్తిగా ఉంటుంది. నందమూరి బాలకృష్ణ వారసుడు నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే నందమూరి జయకృష్ణ కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు.

చైతన్య కృష్ణ హీరోగా నటించిన ‘బ్రీత్’ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది. ప్రసాద్ ప్రివ్యూ థియేటర్లో రిలీజ్ చేసిన ఈ టీజర్ కి ప్రేక్షకుల నుండి మంచి స్పందన వస్తుంది. ఈ సినిమాలో చైతన్య కృష్ణ రెగ్యులర్ పాత్రల్లో కాకుండా భిన్నమైన పాత్రలో కనిపిస్తారని టీజర్ చూస్తే అర్థమవుతుంది. బ్రీత్ మూవీ టీజర్ ని వైద్యో నారాయణో హరి అనే టాగ్ లైన్ తో తాజాగా రిలీజ్ చేశారు. మెడికల్ మాఫియా బ్యాక్ డ్రాప్ థ్రిల్లర్ మూవీగా ఇది బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితం చూపిస్తుందో అనేది వేచి చూడాలి.

బ్రీత్ సినిమాకి వంశీకృష్ణ ఆకెళ్ల దర్శకత్వం వహిస్తుండగా నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించిన బడ్జెట్ విషయంలో ఏ మాత్రం వెనకడుగు వేయలేదట. ఇక బ్రీత్ సినిమాలో నందమూరి చైతన్య కృష్ణకి జోడిగా వైదిక సెంజలియా నటించింది. సినిమాలో చైతన్య కృష్ణ లుక్స్ కి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించిన రిలీజ్ డేట్ ని మూవీ యూనిట్ ప్రకటిస్తారు. నందమూరి అభిమానులు చైతన్య కృష్ణ నటిస్తున్న మొదటి సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నారు.