బాబు మాట కేసీఆర్ నోట..ఏపీ విలువ దిగజారిందా?

ఏపీలో ఆర్ధిక పరిస్తితులు దిగజారిపోయయా? జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయిందా? ప్రజల ఆర్ధిక పరిస్తితి ఛిన్నాభిన్నం అయిందా? అంటే ప్రతిపక్షాలు అవుననే అంటున్నాయి. అప్పులు చేయడం, పన్నుల భారం పెంచడం..ఇక ఆ డబ్బులనే తిరిగి పథకాల రూపంలో ప్రజలకు ఇవ్వడం..ఇక ఇసుక, ఇళ్ల స్థలాలు, మైనింగ్, కాంట్రాక్టులు, భూ కబ్జాలు చేసి..రకరకాలుగా వైసీపీ నేతలు దోపిడి చేసి ఏపీని మరింత దారుణంగా చేశారని, ప్రశ్నించిన వారిపై దాడులు, వేధింపులు, కేసులు పెడుతున్నారని…ఏపీని మరో బీహార్ గా మార్చేశారని ప్రతిపక్షాలు పదే పదే ఆరోపిస్తున్నాయి.

ప్రతిపక్షాలే కాదు..పక్కనే ఉన్న తెలంగాణలోని అధికారంలో ఉన్న నేతలు సైతం..ఏపీ ఆర్ధిక పరిస్తితి గురించి, రోడ్లు, కరెంట్ గురించి అప్పుడప్పుడు కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ఇదే క్రమంలో తాజాగా సి‌ఎం కే‌సి‌ఆర్..ఒకప్పుడు ఏపీలో ఒక ఎకరం అమ్మితే..తెలంగాణలో 5 ఎకరాలు కొనేవారు అని, ఇప్పుడు తెలంగాణలో ఒక ఎకరం అమ్మితే, ఏపీలో 50 ఎకరాలు కొనే పరిస్తితి ఉందని అన్నారు. ఈ మధ్యన ఈ వ్యాఖ్యలు టి‌డి‌పి అధినేత చంద్రబాబు చేశారు. జగ ప్రభుత్వంలో ఏపీ వర్ధిక వ్యవస్థ మరింత దిగజారిందని చెప్పారు. ఇక బాబు చెప్పిన మాటలని కే‌సి‌ఆర్ గుర్తు చేసి చెప్పారు. ఈ కామెంట్లపై ఏపీ మంత్రులు కూడా స్పందిస్తున్నారు. కే‌సి‌ఆర్ చెప్పేది హైదరాబాద్ లోనే భూముల విలువ బట్టి చెబుతున్నారని, అదే విశాఖలో ఒక ఎకరం అమ్మితే, తెలంగాణలో వంద ఎకరాలు కొనేయొచ్చు అని మంత్రి గుడివాడ అమర్నాథ్ చెప్పుకొచ్చారు.

కానీ ఏదేమైనా ఏపీ ఆర్ధిక వ్యవస్థ మాత్రం దిగజారినట్లే కనిపిస్తుంది. కాకపోతే కేవలం పథకాలతోనే ప్రభుత్వం సరిపెడుతుంది. ఇక పథకాలు అందేవారు..అదే అభివృద్ధి అనుకుంటున్నట్లు కనిపిస్తున్నారు. మరి ఏపీ ఆర్ధిక వ్యవస్థ ఎపుడు గాడిలో పడుతుందో.