శాశ్వత సీఎంగా జగన్..బాబు-పవన్‌కు కష్టమేనా?

రాజకీయాల్లో శాశ్వత పదవులు అనేవి ఉండటం కష్టం..అది కూడా ప్రజస్వామ్య దేశమైన మన భారతదేశంలో ఎవరు శాశ్వతంగా అధికారాన్ని అనుభవించలేరు. ఇదేమి చైనా, ఉత్తర కొరియా కాదనే చెప్పాలి..నియంతల పాలన మన దేశంలో ఉండదు. కానీ అధికారంలో ఉండేవారు. శాశ్వతంగా తమదే అధికారమనే భావనలో ఉంటున్నారు. పైగా ప్రత్యర్ధులని లేకుండా చేయడానికి ఎలాంటి రాజకీయమైన చేస్తున్నారు.

మరి ఇలా చేసి శాశ్వతంగా అధికారంలో ఉండటం సాధ్యమేనా? అంటే ప్రజలు అలా ఉండనివ్వరు అని చెప్పాలి.  శాశ్వతంగా ఒకరికే అధికారం కట్టబెట్టారు. అయితే ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ శాశ్వతంగా అధికారంలో ఉంటామని అంటుంది. అలాగే జగన్ శాశ్వత సి‌ఎం అని చెబుతున్నారు. జగన్ మరో 30 ఏళ్ల పాటు సి‌ఎంగా కొనసాగుతారని, అందులో ఎలాంటి డౌట్ లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఇటీవల గుడివాడ సభలో కొడాలి నాని అదే తరహాలో మాట్లాడారు. తాజాగా కోవూరు ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి సైతం అలాగే మాట్లాడారు.

అంటే శాశ్వతంగా జగనే సి‌ఎంగా ఉంటారని చెప్పుకొస్తున్నారు. వైసీపీ నేతలంతా అదే పనిలో ఉన్నారు.  అసలు శాశ్వతంగా అధికారంలో ఉంచేది లేదు అనేది ప్రజల చేతుల్లో ఉంది. వారు ఎవరికి శాశ్వత అధికారం ఇవ్వరు. పాలన బాగుండి, అభివృధ్ది జరుగుతూ, ఆర్ధిక పరిస్తితులు బాగుంటే ప్రజలు..మరొక అవకాశం ఇస్తారు. మరి వైసీపీ పాలనలో ఇదంతా జరుగుతుందా? అంటే ఆ విషయం ప్రజలకే తెలియాలి.

వారికి నచ్చితే మళ్ళీ జగన్‌ని సి‌ఎం చేస్తారు..లేదంటే మార్చేస్తారు. అలా అని వైసీపీ నేతలు చెబుతున్నట్లు జగన్‌ని శాశ్వత సి‌ఎంగా మాత్రం ఉంచలేరు. అటు ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ ఏమి తక్కువ కాదు. వారికి ప్రజా మద్ధతు ఎక్కువే.ఇక ఇద్దరు కలిస్తే సీన్ మారిపోతుంది. కాబట్టి వారిద్దరికి జగన్‌ని గద్దె దించడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే శాశ్వతంగా అధికారంలో ఎవరు ఉండరు.