ఏంటీ.. త‌మ‌న్నా ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌కు ఇంత‌కు ముందే ఆ స్టార్ హీరోయిన్ తో పెళ్లైందా?

మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే హీరోగా ఎదుగుతున్న‌ విజ‌య్ వ‌ర్మ‌తో రిలేష‌న్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రూ జంట‌గా `ల‌స్ట్ స్టోరీస్ 2`లో న‌టించారు. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ స‌మ‌యంలో విజ‌య్ వ‌ర్మ‌, త‌మ‌న్నా మ‌ధ్య ప్రేమ చిగురించింది. దాదాపు ఏడాది కాలం నుంచి వీరిద్ద‌రి మధ్య ప్రేమాయ‌ణం కొన‌సాగుతోంది. ఇటీవ‌లె త‌మ‌న్నా, విజయ్ వ‌ర్మ త‌మ ప్రేమ విష‌యాన్ని కూడా బ‌ట్ట‌బ‌య‌లు చేశారు.

అయితే ఇప్పుడు ఓ షాకింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్ గా మారింది. అదేంటంటే.. త‌మ‌న్నా ప్రియుడు విజ‌య్ వ‌ర్మ‌కు ఇంత‌కు ముందే ఓ స్టార్ హీరోయిన్ తో పెళ్లైంద‌ట‌. ఇందుకు సంబంధించిన ఫోటో కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొడుతోంది. ఇంత‌కీ విజ‌య్ వ‌ర్మ వివాహం చేసుకుంది మ‌రెవ‌రినో కాదు స్టార్ బ్యూటీ అలియా భ‌ట్‌. వీరి పెళ్లి జ‌రిగింది కూడా రియ‌ల్ గా కాదు రీల్ లైఫ్ లోనే.

అలియా భ‌ట్‌, విజ‌య్ వ‌ర్మ జంట‌గా `డార్లింగ్స్‌` మూవీలో న‌టించారు. అయితే త‌న త‌ల్లిని ఆట‌ప‌ట్టించేందుకు ఈ మూవీలో అలియా భ‌ట్ తో వివాహం అయిన ఫోటోను ఫ్రేమ్ చేయించి ఇంటికి ప‌ట్టికెళ్లాడ‌ట‌. ఈ ఫోటో చూడ‌గానే విజ‌య్ వ‌ర్మ త‌ల్లి మొద‌ట షాకైపోయింది. `నీకు పెళ్లైందా..?` అంటూ ప్ర‌శ్నించింద‌ట‌. ఆ త‌ర్వాత ఇదొక ఫ్రాంకీ జోక్ అని తెలిసి తెగ న‌వ్వుకున్నార‌ట‌. ఇక ఇప్ప‌టికీ విజ‌య్ వ‌ర్మ ఇంట్లో అలియా భ‌ట్ తో వివాహం అయిన ఫోటో ఫ్రేమ్ ఉంది. అదే ఇప్పుడు నెట్టింట వైర‌ల్ గా మార‌డంతో.. విజ‌య్ వ‌ర్మ‌కు ఆల్రెడీ పెళ్లైందా అంటూ కొంద‌రు నెటిజ‌న్లు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నారు.