రాజమౌళినే మెప్పించిన స్టార్ పొలిటీషియన్ ఎవరో తెలుసా..?

డైరెక్టర్ రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తను తెరకెక్కించే సినిమాలతోనే ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించారు.. తన సినిమాతోనే ఎలాంటి వండర్ ని క్రియేట్ చేయడానికి అయినా సిద్ధమవుతూ ఉంటారు రాజమౌళి. ఈమధ్య వచ్చిన సినిమాలను చూస్తే రాజమౌళి రేంజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పవచ్చు. ఎంతమంది నటీనటుల సైతం రాజమౌళితో సినిమా చేయాలని కలలు కంటూ ఉంటారు. కానీ రాజమౌళి తను చేయాలనుకున్న హీరోతోనే మాత్రమే సినిమాలను చేస్తూ ఉంటారు.

Rajamouli to Harish Rao.. Harish Rao to Rajamouli
తాజాగా రాజమౌళి గురించి ఒక విషయం వైరల్ గా మారుతోంది. అదేమిటంటే తెలంగాణ మంత్రి హరీష్ రావు కి రాజమౌళి పెద్ద అభిమాని అన్నట్టుగా తెలుస్తోంది.. గత ఆదివారం బంజారాహిల్స్ లోని లిటిల్ స్టార్స్ షి ప్రైవేటు హాస్పిటల్ ప్రారంభోత్సవంలో మంత్రి హరీష్ రావుతో రాజమౌళి కలిసి అక్కడ పాల్గొనడం జరిగింది. అయితే అప్పుడు రాజమౌళి మాట్లాడుతూ కొన్ని విషయాలను తెలిపారు.. మంత్రి హరీష్ రావు పనితీరు చూసి నేను ఫిదా అయిపోయానని రాజమౌళి తెలియజేయడం జరిగింది.

షూటింగ్ కోసం సిద్దిపేటకు వెళ్ళినప్పుడు అక్కడ తాను చూసిన సిద్దిపేటకు ఇప్పుడు చూసిన సిద్దిపేటకు చాలా మార్పు వచ్చిందని అదంతా కేవలం మంత్రి హరీష్ రావు గారి పనితీరే అన్నట్లుగా తెలియజేశారు. ఆయనను కలుసుకోవడం కూడా చాలా ఆనందంగా ఉంది అంటూ రాజమౌళి తెలియజేయడం జరిగింది. ఆ తర్వాత మంత్రి హరీష్ రావు కూడా మాట్లాడుతూ రాజమౌళి గారికి ఆస్కార్ అవార్డు సాధించినందుకు అభినందనలు తెలియజేయడం జరిగింది.. అంతేకాకుండా తెలుగు కీర్తిని ప్రపంచవ్యాప్తంగా మార్చిన డైరెక్టర్ రాజమౌళి గారికే ఇది సాధ్యమైందని తెలిపారు. రాజమౌళి గారి సినిమాలలో సామాజిక స్పృహ దేశభక్తిని వంటివి కనిపిస్తాయని హరీష్ రావు తెలిపారు. ఇలా మరెన్నో విజయాలను అందుకోవాలని రాజమౌళికి అభినందనలు తెలిపారు హరీష్ రావు.