సీమలో జగన్‌కు రిస్క్..ఆధిక్యం ఉంది..కానీ!

రాయలసీమ అంటే వైసీపీకి కంచుకోట. అక్కడ జగన్ హవా ఎక్కువ ఉంది. అందుకే గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే ఆధిక్యం. గత ఎన్నికల్లో అయితే వైసీపీ వన్ సైడ్ గా గెలిచింది. సీమ మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీ ఏకంగా 49 సీట్లు గెలుచుకుంది..అంటే జగన్ వేవ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతటి భారీ విజయం అందుకున్న సీమలో ఈ సారి వైసీపీ సత్తా చాటుతుందా? గత ఎన్నికల మాదిరిగానే ఫలితాలు వస్తాయా? అంటే రావనే చెప్పాలి.

ఈసారి సీమ ప్రజల అభిప్రాయం మారుతుంది. ఏళ్లతరబడి కాంగ్రెస్, వైసీపీలనే గెలిపిస్తూ వస్తున్నారు. అయినా సరే సీమకు ఒరిగింది ఏమి లేదు. పెద్దగా అభివృద్ధి చెందింది లేదు. కొద్దో గొప్పో టి‌డి‌పి హయాంలోనే అభివృద్ధి జరిగిందనే అభిప్రాయం ప్రజల్లో ఉంది.గత ఎన్నికల్లో వైసీపీకి అన్నీ సీట్లు ఇచ్చిన సీమ జిల్లాలకు చేసిందేమి లేదు. అలాగే ఎక్కువగా ఉన్న రెడ్డి సామాజికవర్గానికి కూడా పెద్దగా న్యాయం జరగలేదు. ఏదో కొందరు రెడ్లు మాత్రమే బాగుపడ్డారు గాని..ఆ వర్గంలో ప్రజలకు ఒరిగింది లేదు.

దీంతో వారి మైండ్ సెట్ కూడా మారుతుంది.వారు కూడా వైసీపీకి యాంటీగా వస్తున్నారు. దీంతో సీమ ఓటు బ్యాంక్ మారిపోతుంది. గత ఎన్నికల మాదిరిగా ఈ సారి వైసీపీకి మంచి ఫలితాలు వచ్చేలా లేవు. మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీకి 30 సీట్లు వరకు ఆధిక్యం ఉంటే….టి‌డి‌పి 22 సీట్లలో ఆధిక్యంలో ఉంది. ఎన్నికల నాటికి ఈ పరిస్తితి మరింత మారేలా ఉంది.

ఇప్పటికీ వైసీపీకి ఆధిక్యం ఉన్నా సరే..టి‌డి‌పి అన్నీ స్థానాల్లో లీడ్ లోకి రావడం వైసీపీకి దేబ్బే. సీమలోనే ఇలా ఉంటే..అటు కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాలకు వెళ్ళే సరికి సీన్ ఇంకా మారుతుంది. కాబట్టి వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగేలా ఉంది.