కాంగ్రెస్ దూకుడు..కానీ ఆధిక్యం బీఆర్ఎస్ వైపే.!

తెలంగాణలో రాజకీయం మారింది. ఇప్పటివరకు కృత్రిమగా క్రియేట్ చేసిన బి‌ఆర్‌ఎస్, బి‌జే‌పిల మధ్య రాజకీయ యుద్ధం అనే ముగిసింది. గ్రౌండ్ లో బలం ఉన్న కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. దీంతో బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య అసలు వార్ మొదలైంది. ఈ రెండు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. దీంతో అసలు ఆట ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడటంతో కాంగ్రెస్ లోకి వలసలు భారీగా జరుగుతున్నాయి.

ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి పెద్ద ప్లస్ అవుతాయి. అయితే బి‌ఆర్‌ఎస్ లో ఇప్పటికే నేతలు ఎక్కువగా ఉన్నారు. కాబట్టి కొందరు వెళ్లిపోతేనే పార్టీకి ప్లస్. ఇక మొన్నటివరకు హడావిడి చేసిన బి‌జే‌పికి క్షేత్ర స్థాయిలో బలం లేదు. కేవలం అభ్యర్ధులని బట్టే ఆ పార్టీకి బలం అని తేలిపోయింది. మొత్తానికి ఎన్నికలు మాత్రం బి‌ఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లు జరుగుతాయి. కొన్ని సీట్లలోనే బి‌జే‌పి రేసులో ఉంటుంది. అది కూడా ఆయా సీట్లలో బి‌జే‌పికి ఉండే బలమైన అభ్యర్ధులు బట్టే.

ఇక ఇటీవల వస్తున్న సర్వేలని చూసుకుంటే..104 మంది ఎమ్మెల్యేలతో ఉన్న బి‌ఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు 55-60 స్థానాల్లోనే గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలిసింది. ఇటు కేవలం 5 గురు ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ దాదాపు 45 స్థానాలు వరకు గెలుచుకునే ఛాన్స్ ఉందని సర్వేలో తేలింది. ఇక ఎం‌ఐ‌ఎం పార్టీకి 7 స్థానాలు మామూలే..బి‌జే‌పి సింగిల్ డిజిట్ కే పరిమితం కానుందని తేలింది. ఎంత కాదు అనుకున్న ఆ పార్టీకి 10 లోపు సీట్లే వస్తాయని అంటున్నారు.

మొత్తానికి బి‌ఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే టఫ్ ఫైట్ జరగనుండీ.ప్రస్తుతానికి బి‌ఆర్‌ఎస్ కు లీడ్ ఉంది. ఎన్నికల నాటికి ఇది పెరుగుతుందో లేక తగ్గుతుందో చూడాలి.