సీట్లపై బాబు క్లారిటీ..ఆ నేతలకు షాక్ తప్పదు.!

నెక్స్ట్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి గెలుపు ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వచ్చే ఎన్నికల్లో కూడా ఓడిపోతే టి‌డి‌పి మనుగడకే ప్రమాదం..అందుకే చంద్రబాబు పార్టీని గెలిపించడం కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు. గతంలో మాదిరిగా ఎక్కడా వెనక్కి తగ్గకుండా ముందుకెళుతున్నారు. ముఖ్యంగా సీట్ల పంపకాల విషయంలో బాబు కఠినంగా ఉంటున్నారు. గతంలో మొహమాటనికి పోయి గెలవలేని నేతలకు కూడా సీట్లు ఇచ్చేవారు.

కానీ ఇప్పుడు అలాంటి పరిస్తితి లేదు..గెలవడం కోసం ఎలాంటి నేతనైన పక్కన పెట్టేస్తామని బాబు చెప్పేస్తున్నారు. అందులో ఎలాంటి డౌట్ లేదని అంటున్నారు.  ఈసారి ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల ఎంపికలో తాను ఏ మొహమాటాలూ పెట్టుకోదలచుకోలేదని, మొహమాటపడి టికెట్లు ఇస్తే ప్రభుత్వంలోకి రాలేమని చెప్పేశారు. తాను గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాతే అసెంబ్లీలో అడుగుపెడతానని చెప్పానని, అలా జరగాలంటే గట్టి అభ్యర్థులను ఎన్నికల్లో నిలిపి గెలవాలని చెపుకొచ్చారు.

ప్రతి నియోజకవర్గ సమాచారం సేకరిస్తున్నానని, సర్వేలు చేయిస్తున్నామని, పార్టీ నేతలు, కార్యకర్తలతో మాట్లాడుతున్నామని,  అన్నీ పరిగణనలోకి తీసుకునే అభ్యర్థులను ఖరారు చేస్తామని బాబు నేతలకు క్లారిటీ ఇచ్చారు. ఇక ప్రతి పరిశీలకుడు నెలలో ఎనిమిది రోజులు తమకు కేటాయించిన నియోజకవర్గంలో తప్పనిసరిగా ఉండాలని, వారితో కూడా నెలకు రెండుసార్లు మాట్లాడతానని అన్నారు.

ఇక టి‌డి‌పిలో ఈ మధ్య ఎన్‌ఆర్‌ఐల హడావిడి ఎక్కువైన విషయం తెలిసిందే. పలుచోట్ల సేవ కార్యక్రమాలు చేస్తూ ప్రజల్లో ఉంటూ, సీటు ఆశిస్తున్నారు. ఇక ఎన్‌ఆర్‌ఐలపై టి‌డి‌పి సీనియర్ నేత ప్రత్తిపాటి పుల్లారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫౌండేషన్లు, ట్రస్టుల పేరుతో వచ్చేవారిని దగ్గరకు రానివ్వొద్దని , ఈ నాలుగేళ్లూ వీళ్లు ఏమయ్యారు? అక్కడో పది వేలు.. ఇక్కడో పది వేలు ఇచ్చి టికెట్లు కావాలంటే ఇచ్చేస్తారా? ఇప్పుడేదో రూ.కోటి ఖర్చు పెట్టి ఎక్కడా లేని హడావుడి చేస్తారు. తర్వాత చేతులెత్తేస్తారని అన్నారు. చూడాలి మరి బాబు ఎవరెవరికి సీట్లు ఇస్తారో.