మహేష్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. సూర్య బాయ్ కమింగ్..!!

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో ఎక్కువగా రీ రిలీజ్ ట్రెండ్ బాగ కొనసాగుతోంది. సందర్భాన్ని బట్టి హీరోల పాత చిత్రాలను సైతం రీ రిలీజ్ చేస్తు కలెక్షన్లను బాగానే రాబట్టుకుంటున్నారు నిర్మాతలు. ఇప్పటికే ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలు కూడా విడుదలై బాగానే సక్సెస్ అయ్యాయి.. ఈ ట్రెండ్ మొదలుపెట్టింది మహేష్ బాబు ఇప్పుడు మరొకసారి మహేష్ నటించిన బిజినెస్ మాన్ చిత్రం రీ రిలీజ్ కు సిద్ధమవుతోంది. ఈ విషయం తెలిసిన మహేష్ ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు.

Business Man telugu Movie - Overview

మహేష్ నటించిన పోకిరి వంటి బ్లాక్బస్టర్ సినిమాతో మొదటిసారిగా రీ రిలీజ్ ట్రెండ్ ని కొనసాగించారు. ఆ తరువాత ఒక్కడు సినిమాని రీ రిలీజ్ చేశారు. ఇప్పుడు బిజినెస్ మాన్ చిత్రంతో మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించాక ఏ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాధ దర్శకత్వం వహించారు. 2012 జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం కలెక్షన్ పరంగా రాబట్టడమే కాకుండా మహేష్ లో మరొక మాస్ ఇమేజ్ ని కూడా తీసుకువచ్చింది.

ముఖ్యంగా నెగిటివ్ రోల్ లో చాలా డిఫరెంట్ పాత్రలో మహేష్ అద్భుతంగా నటించారు.ఈ చిత్రం వచ్చి ఇప్పటికీ పదేళ్లు అవుతున్న ఇప్పటికీ అదే క్రేజ్ కొనసాగుతోంది.ఈ సినిమాలోని డైలాగ్స్ మిమ్స్ రూపంలో ఇప్పటికీ అక్కడక్కడ కనిపిస్తూనే ఉంటాయి. ఈ సినిమా రీ రిలీజ్ ను మహేష్ బాబు పుట్టినరోజున ఆగస్టు 9వ తేదీన థియేటర్లో విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.. దీంతో పలువురు అభిమానులు నెట్టిజనులు సైతం సూర్య భాయ్ మళ్లీ వస్తున్నాడు అంటూ పలు రకాల కామెంట్లు చేస్తున్నారు. మరి ఈ విషయంపై చిత్ర బృందం అధికారికంగా క్లారిటీ ఇస్తుందేమో చూడాలి మరి.

ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్లో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రం అయిపోయిన వెంటనే డైరెక్టర్ రాజమౌళితో మరొక సినిమాలో నటిస్తున్నారు మహేష్ బాబు.