బాహుబలి సినిమా కోసం అన్ని కోట్లు అప్పు చేశారా.. రివిల్ చేసిన రానా..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో బాహుబలి చిత్రం కు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.. ప్రభాస్ రానా ఇందులో ఎంతో అద్భుతంగా నటించారు. డైరెక్టర్ రాజమౌళి ఈ సినిమాకి దర్శకత్వం వహించగా హీరోయిన్గా అనుష్క, తమన్నా నటించారు. ఈ పాన్ ఇండియా లెవెల్ లో విడుదల మంచి బ్లాక్ బాస్టర్ విజయంక అందుకుంది. ఈ సినిమాని నిర్మించడం నిర్మాతలకు ఒక పెద్ద తలనొప్పిగా మారిందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం పైన హీరో రానా స్పందించి పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు వాటి గురించి తెలుసుకుందాం.

Train Like Rana Daggubati: Workout & Diet Plan For A Physique Like The ' Baahubali' Beast

బాహుబలి చిత్రాన్ని నిర్మించడం కోసం.. ఆర్కా మీడియా వారు చాలా రిస్కు తీసుకున్నట్లుగా రానా తెలియజేశారు. ఈ సినిమాని నిర్మించే సమయంలో ఎన్నో కష్టాలు ఎదురయ్యాయని నిజంగా నిర్మాతలు ఈ సినిమా నిర్మించే సమయంలో ఆర్థిక ఒత్తిడికి లోనయ్యారని తెలియజేశారు.. బాహుబలి ఫ్రాన్స్ చేసి సినిమాను తీయడానికి అప్పు గా తీసుకున్న డబ్బు గురించి కూడా రానా తెలియజేశారు. ఈ చిత్రానికి 100 కోట్ల బ్యాంకు నుండి అధిక వడ్డీ రేట్లు తీసుకువచ్చారని తెలియజేశారు..

మూడు నాలుగు ఏళ్ల క్రితం సినిమాల్లోకి పెట్టుబడిగా పెట్టిన డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే సినిమా నిర్మాతలు తమ ఇల్లు లేదా ఆస్తి బ్యాంకును తాకట్టు పెట్టి వడ్డీలు కట్టి మరీ తెచ్చామని తెలిపారు.. దాదాపుగా 28% వరకు వడ్డీ చెల్లించినట్లు తెలుస్తోంది. అయితే బాహుబలి సినిమాకి మాత్రం వడ్డీ లెక్క వేసుకుంటే రూ .300 నుంచి రూ .400 కోట్లు అప్పుగా తీసుకున్నారని తెలిపారు. ముఖ్యంగా మొదటి భాగం తీసేటప్పుడు చాలా కష్టమైందని తెలిపారు రానా. తెలుగులో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా అంటే రెండు రెట్లు అధికంగా ఖర్చు చేశారు కాబట్టి.. ఎంత సంపాదించారు ఎంత లాభం వచ్చింది అనేది లెక్క వేయడం సరికాదని తెలిపారు రానా. ఒకవేళ మొదటి భాగం సరిగ్గా ఆడకపోయి ఉంటే ఊహించలేము అని తెలిపారు రానా.