పవన్ తర్వాత బాబు..పక్కా స్ట్రాటజీతో సభలు.!

టి‌డి‌పి అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ పొత్తు దిశగా వెళుతున్న విషయం తెలిసిందే. పైకి పొత్తు గురించి మాట్లాడకపోయినా అంతర్గతంలో ఇద్దరు నేతలు ఒకే దిశగా రాజకీయం చేస్తున్నట్లు కనిపిస్తున్నారు. పైగా ఒక అండర్‌స్టాడింగ్ తో ముందుకెళుతున్నారు. ఇటీవల వారాహి యాత్రతో పవన్ దూసుకెళుతున్నారు. గోదావరి జిల్లాల్లో ఆయన పర్యటన సాగుతుంది. ఈ నెల 30న భీమవరం సభతో ఆయన పర్యటన ముగుస్తుంది. మళ్ళీ రెండోవిడత యాత్ర ఉంటుంది..కానీ దాని షెడ్యూల్ రాలేదు.

ఇక పవన్ యాత్ర ముగియగానే బాబు రంగంలోకి దిగుతున్నారు. ఆయన జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. ఒకటి గమనిస్తే పవన్ వారాహి యాత్ర సమయంలో బాబు ఎక్కడకు వెళ్లలేదు. కేవలం పార్టీ పరమైన కార్యక్రమాలే చూసుకుంటున్నారు. అంటే ఒకరి తర్వాత ఒకరు ప్రజల్లోకి వెళుతున్నారు. ఇప్పుడు పవన్ యాత్ర ముగుస్తుండటంతో బాబు ఎంట్రీ ఇస్తున్నారు. జులై రెండు వారం నుంచి బాబు జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు.

 

అయితే ప్రస్తుతం పార్టీ పరమైన అంశాల్లో బాబు బిజీగా ఉన్నారు. నియోజకవర్గాల ఇంచార్జ్ లతో మాట్లాడటం, అక్కడ పనితీరు గమనించడం, విభేదాలు ఏమైనా ఉంటే సరిచేయడం..ఇంచార్జ్ లు లేని నియోజకవర్గాలపై ఫోకస్ పెట్టి ముందుకెళ్లడం..ఆ స్థానాల్లో కొత్త వాళ్ళని నియమించడం చేస్తున్నారు. ఇప్పటికే ఒక విడత 175 స్థానాల నేతలతో సమీక్షా సమావేశాలు  నిర్వహించారు. ఇప్పుడు రెండో విడత మొదలుపెట్టారు.

ఇక వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలు, టీడీపీ మేనిఫెస్టో హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి చంద్రబాబు మరో విడత పర్యటనలకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. జూలై రెండో వారం నుంచి ఆయన పర్యటనలు ప్రారంభం కావచ్చని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇటు లోకేశ్‌ పాదయాత్ర, అటు భవిష్యతకు గ్యారెంటీ పేరుతో టి‌డి‌పి నేతలు బస్సు యాత్రలు చురుగ్గా జరుగుతున్నాయి. మొత్తానికి టి‌డి‌పి దూకుడుగా ముందుకెళుతుంది.