మహిళా-యువ ఓటు బ్యాంకుపైనే ఫోకస్..టీడీపీకి కలిసొస్తుందా?

రాజకీయాల్లో కొన్ని వర్గాలు..బాగా ప్రభావం చూపుతాయి..ఎన్నికల ఫలితాలని తారుమారు చేయగలవు. గెలుపోటములని డిసైడ్ చేయగలవు. అలా డిసైడ్ చేసే వర్గాలు కొన్ని ఉన్నాయి..వాటిల్లో కీలకమైనవి మహిళలు, యువత..ఈ ఓటు బ్యాంకు గెలుపోటములని మార్చేయగలవు. గత ఏపీ ఎన్నికల్లో ఈ రెండు వర్గాలు మెజారిటీ స్థాయిలో వైసీపీ వైపు మొగ్గు చూపాయి. దీంతో వైసీపీకి భారీ విజయం దక్కింది.

మహిళలకు జగన్ కీలక హామీలు ఇవ్వడం, అమ్మఒడి, డ్వాక్రా రుణమాఫీ, మద్యపాన నిషేధం..ఇటు ప్రత్యేక హోదా సాధించి..కంపెనీలు, జాబ్ క్యాలెండర్ వేసి ఉద్యోగాలు ఇస్తామని యువతకు జగన్ హామీలు ఇచ్చారు. దీంతో మహిళలు, యువత వైసీపీ వైపు మొగ్గు చూపారు. దీంతో జగన్ వన్ సైడ్ గా గెలిచేశారు. అలా వైసీపీ వైపుకు వెళ్ళిన వారిని తిరిగి టి‌డి‌పి వైపుకు తిప్పుకోవడానికి చంద్రబాబు గట్టిగానే కష్టపడుతున్నారు. ఈ క్రమంలోనే యువతని, మహిళలని ఆకట్టుకునేలా సరికొత్త పథకాలని ఇస్తామని బాబు హామీల వర్షం కురిపించారు.

మహానాడు వేదికగా మినీ మేనిఫెస్టోని రూపోదించారు..దీంట్లో మహిళలు, యువతకు ప్రాధాన్యత ఇచ్చారు. దీంతో 18 నుంచి 59 ఏళ్ల వరకు ఉన్న మహిళలకు నెలకు రూ1500 ఇవ్వనున్నారు. 60 ఏళ్ళు పైబడిన వారికి, వితంతువులకు ఎలాగో పింఛన్ వస్తుంది. అలాగే తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే..అందరికీ ఏడాదికి రూ. 15 వేలు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం. జిల్లాలో ఎక్కడ నుంచి ఎక్కడకు ప్రయాణం చేసిన ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితం.

ఎంతమంది సంతానం ఉన్న స్థానిక సంస్థల్లో పోటీ చేసే అవకాశం. అటు యువతకు 20 లక్షల ఉద్యోగాలు, నెలకు 3 వేల నిరుద్యోగ భృతి..ఇటు రైతులకు ఏడాదికి రూ.20 వేల సాయం. ఇలా కీలక హామీలు ఇచ్చి..మహిళలు, యువతని ఆకట్టుకునేలా బాబు మేనిఫెస్టో రూపోదించారు.