ఆ హీరోకి గుర్తుగా అలాంటి పని చేసిన ప్రియమణి.. ఏమిటంటే..?

హీరోయిన్ ప్రియమణి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే.. అప్పట్లో వరస సినిమాలలో నటించి ఒక వెలుగు వెలిగిన ఈ ముద్దుగుమ్మ ఎవరి అతగాడు చిత్రంతో మొదటిసారిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది ఆ తర్వాత పెళ్లయిన కొత్తలో, హరే రామ్, శంభో శివశంభో, గోలీమార్, యమదొంగ వంటి చిత్రాలలో నటించింది. తర్వాత బాలీవుడ్ , కోలీవుడ్ చిత్రాలలో కూడా నటించి బాగానే పేరు సంపాదించింది.

Priyamani says Shah Rukh Khan gave her Rs. 300 while shooting for the  Chennai Express song : Bollywood News - Bollywood Hungama
ఒకవైపు వెండితెరపై , మరొకవైపు బుల్లితెర పైన కూడా బాగానే రాణిస్తోంది. ఈ క్రమంలోనే ప్రియమణికి సంబంధించిన ఒక న్యూస్ వైరల్ గా మారుతోంది.. ప్రియమణి ఒక స్టార్ హీరో ఇచ్చిన రూ.300 రూపాయలను ఇప్పటికీ ప్రియమణి వాటిని చాలా భద్రంగా దాచుకుందట. ఈ విషయాన్ని గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేసింది. హిందీలో ది ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో మంచి పాపులారిటీ సంపాదించుకుంది ప్రియమణి.

After 'Chennai Express' South Diva Priyamani To Do A Cameo Song In Shah  Rukh Khan's 'Jawan'| Here's What We Know
అయితే ఈ సిరీస్ కంటే ముందే ఈమె షారుఖ్ ఖాన్ దీపిక పదుకొనే నటించిన చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రంలో ఒక స్పెషల్ సాంగ్ నటించింది.. యాక్షన్ కామెడీ డ్రామాగా వచ్చిన ఈ చిత్రం ఈమె పాటకు అద్భుతమైన రెస్పాన్స్ లభించింది. ఈ సాంగ్ కోసం ఐదు రాత్రులకు పైగా షూటింగ్ జరిగిందని అది చాలా గొప్ప అనుభూతి అంటూ తెలిపింది ప్రియమని ఈ సాంగ్ చిత్రీకరణ సమయంలో షారుక్ ఖాన్ తాను కలసి ఐప్యాడ్ లో కౌన్ బనేగా కరోడ్పతి ప్రోగ్రాం చేసామని ఆ సమయంలో తన వద్ద ఉన్న రూ.300 రూపాయలను ఇచ్చాడని ఇప్పటికీ ఆ డబ్బును తాను చాలా భద్రంగా దాచుకున్నారని తెలియజేసింది. షారుఖ్ ఖాన్ ఒక లవ్లీ యాక్టర్ అని షూటింగ్ సమయంలో తన తోటి వాళ్లతో చాలా సంతోషంగా ఉంటారని తెలిపింది ప్రియమణి.