ప‌నిగ‌ట్టుకుని మ‌రీ ఎన్టీఆర్ ప‌రువు తీశారు క‌ద‌రా.. ఇంత‌కంటే ఘోరం ఉంటుందా?

మే 20న యంగ్ టైగర్ ఎన్టీఆర్ 40వ‌ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన `సింహాద్రి` సినిమాను రీ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన‌ ఈ చిత్రంలో భూమిక, అంకిత హీరోయిన్లుగా నటించారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత ఈ సినిమా మళ్లీ థియేటర్స్ లో సందడి చేసింది.

ఇండియా వైడ్ గానే కాకుండా ఆస్ట్రేలియా, యూకే, యూఎస్, కెనెడా, జపాన్, మలేషియాలలో సైతం ఈ సినిమాను భారీ ఎత్తున రీ రిలీజ్ చేశారు. కానీ, ఆల్ టైం రికార్డుని మాత్రం నెలకొల్పలేకపోయారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఖుషి సినిమా మొదటి రోజు రూ. 4. 15 కోట్లు వసూలు చేసి ఆల్ టైం రికార్డు సృష్టించిగా.. ఆ రికార్డ్ ను సింహాద్రి బ్రేక్ చేయ‌లేక‌పోయింది. సింహాద్రి చిత్రం మొద‌టి రోజు రూ. 3.5 కోట్లు వసూలు చేసింది.

అయితే రెండవ రోజు మాత్రం సింహాద్రి పరిస్థితి ఘోరంగా మారింది. చాలా చోట్ల ఆడియన్స్ లేక షోస్ ని క్యాన్సిల్ చేశారు. దాంతో ప‌లు ప్రాంతాలలో జీరో గ్రాస్ న‌మోదు అయింది. రెండో రోజు అతి క‌ష్టం మీద రూ. 10 ల‌క్ష‌ల వ‌ర‌కు రాబ‌ట్టింద‌ని అంటున్నారు. నిజానికి ఈ సినిమా రీ రిలీజ్ అడ్డ‌వానికి నెల రోజుల ముందు నుంచే ప్ర‌మోష‌న్స్ ప్రారంభించారు. దాదాపు నాలుగు కోట్ల ఖ‌ర్చు పెట్టి సింహాద్రిని ప్ర‌మోట్ చేశారు. రీ రిలీజ్ అయిన ఈ సినిమాకు విడ్డూరంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏర్పాట్ చేశారు. కానీ, చివ‌ర‌కు సింహాద్రి రెండో రోజుకే జెండా ఎత్తేసింది. మొత్తానికి అభిమానులు ప‌నిగ‌ట్టుకుని మ‌రీ ఎన్టీఆర్ పరువు తీసేశార‌ని నెటిజ‌న్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Share post:

Latest