నరేష్-పవిత్రల “మళ్లీ పెళ్లి” ప్రీరిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ అయిపోయిందోచ్..ఆ స్పెషల్ రోజే.. చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో పవిత్ర నరేష్ ల పేర్లు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయో మనందరికీ బాగా తెలిసిందే. టాలీవుడ్ సీనియర్ హీరోగా పేరు సంపాదించుకున్న నరేష్ కన్నడ ఇండస్ట్రీ నుండి తెలుగులోకి వచ్చి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పేరు సంపాదించుకున్న పవిత్ర లోకేష్ ..గత కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు అని డేటింగ్ లో ఉన్నారని నానా రకాలుగా వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వాటికి తగ్గట్టే ఈ జంట “మళ్లీ పెళ్లి” అనే సినిమాలో కలిసి నటించి మరోసారి రచ్చ చేయబోతున్నారు .

ఈ సినిమా మే 26న రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోని సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నరేష్ – పవిత్ర కూడా పలు షోస్ కి అటెండ్ అవుతూ తమ సినిమాను ప్రమోట్ చేసుకుంటున్నారు . కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఫ్రీ రిలీజ్ ఈవెంట్ డీటెయిల్స్ ను అఫీషియల్ గా లాక్ చేశారు మూవీ టీం. హైదరాబాద్ ఫిలింనగర్ లోని జేఆర్సి కన్వెన్షన్ లో జరిపేందుకు డేట్ టైం ఫిక్స్ చేశారు. మే 21న సాయంత్రం 6 గంటలకు ఈవెంట్ స్టార్ట్ కాబోతుంది.

ఈ సినిమాలో పవిత్ర లోకేష్-నరేష్ పాత్ర నిజజీవితం ఆధారంగా తెరకెక్కిన విషయం తెలిసిందే . అయితే ఈ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా ఏ ముఖ్య అతిధిని పిలవడం లేదు అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి . మరి ముఖ్యంగా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ ఎందుకు పిలుస్తారు ..? అంటే క్రేజ్ కోసం.. పాపులారిటీ కోసం ..ఈ జంట అందులో టూ పిక్స్ కు వెళ్లిపోయి దూసుకుపోతుంది . మరి ఇలాంటి ఇద్దరు బడా సెలబ్రిటీలకి మరో సెలబ్రిటీ అవసరం ఏముంది అంటూ ఈ సినిమా కి చీఫ్ గెస్ట్ ను పిలవడం మానేశారట . దీంతో ఈ న్యూస్ మరింత హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఏది ఏమైనా సరే నరేష్ పత్రాల మళ్లీ పెళ్లి సినిమా సినీ ఇండస్ట్రీలోనే ఓ సపరేట్ మార్కెట్ క్రియేట్ చేయబోతుంది అంటున్నారు జనాలు ..చూద్దాం ఏం జరుగుతుందో..?

 

Share post:

Latest