హమ్మయ్య..బాలయ్య సినిమాలో తమన్నా ఐటెం సాంగ్..మిల్కి బ్యూటీ క్లారిటి ఇచ్చేసిందోచ్..!!

గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వెబ్ మీడియాలో హీరోయిన్ తమన్నా ఎన్బికె 108 .. సినిమాలో ఐటమ్ సాంగ్ చేయబోతుంది అంటూ ఓ న్యూస్ వైరల్ అయింది . అది ఎంతలా అంటే ఆ వార్త బాలీవుడ్ లో కూడా పాకి తమన్నా కి మరో నాలుగు సినిమాల్లో ఐటెం సాంగ్ ని ఆఫర్ చేశారట. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో ఉన్న పరువు పోతు ఉండటంతో..తమన్నా ఈ న్యూస్ పై రియాక్ట్ అయ్యింది.

ఈ క్రమంలోనే తమన్నా తట్టుకోలేక ఇలాంటి ఫేక్ వార్తలు పై అఫీషియల్ గా స్పందించింది. కొద్దిసేపటి క్రితమే తమన్న తాను ఎన్బికె 108 సినిమాలు నటించట్లేదు అంటూ అఫీషియల్ గా కన్ఫర్మేషన్ ఇచ్చింది . అనిల్ రావిపూడి డైరెక్షన్ ఎక్కుతున్న ఎన్బికె 108 సినిమాలో హీరోయిన్ తమన్నా ఐటెం సాంగ్ చేయబోతుంది అంటూ వార్తలు వినిపించిన క్రమంలో ఆమె రెస్పాండ్ అవుతూ.. అభిమానులకు సింగిల్ లైన్ లో క్లారిటీ ఇచ్చేసింది.

ఆమె స్పందిస్తూ..”అనిల్ రావిపూడి – బాలకృష్ణ గారితో పనిచేసేందుకు నేను ఎప్పుడు రెడీగా ఉంటాను .ఆనందంగా ఫీల్ అవుతాను ..నాకు వారిద్దరు పట్ల ఎంతో గౌరవం – ప్రేమ – అభిమానాలు” ఉన్నాయి . అయితే నేను ఆ సినిమాలో నటిస్తున్నట్లు కొన్ని నిరాధారమైన వార్తలు వస్తున్నాయి . వాటిని చదవడం నాకు ఇబ్బందిగా ఉంది . ఇలాంటి ఫేక్ వార్తలు రాసే ముందు కొంచమైనా ఆలోచించండి “అంటూ సూటిగా సుత్తి లేకుండా తాను ఈ సినిమాలో నటించట్లేదు అంటూ చెప్పుకొచ్చింది . ఈ క్రమంలోనే తమన్నా ఈ పాటలో నటించట్లేదు అంటూ అఫీషియల్ గా క్లారిటీ వచ్చింది..!!

Share post:

Latest