ఇన్నాళ్లు గుర్తు రాని ఎన్టీఆర్ .. ఇప్పుడే మీ కళ్లకి కనిపించాడా..? పుట్టినరోజును పెంట పెంట చేస్తున్న ఫ్యాన్స్..!

సినిమా ఇండస్ట్రీలో రంగులు మార్చడం చాలా కామన్ . ఈ రంగుల ప్రపంచంలో ముఖానికి రంగులు పూసుకునే నటులు ఎన్నెన్నో వేషాలు వేస్తూ ఉంటారు . అయితే తెరపై అలా కనిపిస్తే చాలు తెర వెనక కూడా అలా కనిపించాల్సిన అవసరం లేదు . కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఇండస్ట్రీలో ఉండే సగానికి మందికి పైగా హీరోలు తెర వెనుక ముఖానికి రంగులు పూసుకున్నా.. రంగులు పూసుకోకపోయినా నటిస్తూనే ఉంటారు. అలాంటి ఓ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మనకు తెలిసిందే నేదు జూనియర్ ఎన్టీఆర్ తారక్ పుట్టినరోజు..

నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ తాతకు తగ్గ మనవడిగా సినిమా ఇండస్ట్రీలో చెరగని స్థాయిని క్రియేట్ చేసుకున్నాడు. ఆర్ ఆర్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ని క్రియేట్ చేసుకుని ఒక్కొక్క సినిమాకి 100 కోట్ల రెమ్యూనరేషన్ చార్ఝ్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ త్వరలోనే బాలీవుడ్ లో అడుగుపెడుతున్న విషయం తెలిసిందే . “వార్ 2” సినిమాలో హృతిక్ రోషన్ కి అపోజిషన్ రోల్ లో నెగిటివ్ షేడ్స్ లో తారక్ కనిపించబోతున్నారు . అయితే ఈ సినిమా అనౌన్స్ చేయకముందు.. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు అందుకోక ముందు వరకు ఎన్టీఆర్ పేరును బాలీవుడ్ లో జనాలు పట్టించుకునే వాళ్ళు కాదు.

మరీ ముఖ్యంగా హృతిక్ రోషన్ – సల్మాన్ ఖాన్ – షారుక్ ఖాన్ లాంటి బడా హీరోలు అందరూ చరణ్ కి సపోర్ట్ చేసేవాళ్లు కానీ తారక్ ని పట్టించుకోరు. ఎప్పుడైతే ఆర్ఆర్ఆర్ సినిమాతో ఆస్కార్ అవార్డు అందుకున్నాడో అప్పటినుంచి ఆయనకు బాలీవుడ్ లో ఆఫర్లు రావడం స్టార్ట్ అయ్యాయి . అంతేనా ఎన్టీఆర్ పేరును ప్రమోషన్స్ కోసం వాడుకోవడం స్టార్ట్ చేశాడు. రీసెంట్ గా హృతిక్ రోషన్ – ఎన్టీఆర్ బర్త డే సందర్భంగా చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది .

ఇన్నాళ్లు ఎన్టీఆర్ పుట్టినరోజుకి ఏనాడు విష్ చేసింది లేదు .. అయితే ఇప్పుడే విష్ చేయడం అభిమానులకి ఇబ్బందికరంగా ఉంది. అంతేకాదు మరి కొంతమంది స్టార్స్ ని కూడా ట్యాగ్ చేసి మరి ట్రోల్ చేస్తున్నారు . ఇన్నాళ్లు ఎన్టీఆర్ గుర్తురాని వాళ్లకి పుట్టినరోజు నాడే గుర్తొచ్చాడు.. అది కూడా ఆస్కార్ అవార్డు అందుకున్న తర్వాత కావడం గమనార్హం అంటూ ట్రోల్ చేస్తున్నారు . ఏది ఏమైనా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆవేదనలో నిజం ఉంది . ఇన్నాళ్లు పట్టించుకోని ఎన్టీఆర్ ని ఇప్పుడే ఎందుకు పట్టించుకుంటున్నాడు.. కేవలం ప్రమోషన్స్ కోసమా..? సినిమాల కోసమా..? అంటూ దారుణంగా ట్రోల్ చేస్తున్నారు..!!

Share post:

Latest