విడాకుల త‌ర్వాత ఆ విష‌యంలో చాలా బాధ‌ప‌డ్డా.. హాట్ టాపిక్ గా చైతు కామెంట్స్‌!

అక్కినేని యువ సామ్రాట్ నాగ‌చైత‌న్య కొద్ది నెల‌ల క్రితం స‌మంత‌తో విడిపోయిన సంగ‌తి తెలిసిందే. దాదాపు ఏడేళ్లు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట‌.. నాలుగేళ్లు కూడా క‌లిసి ఉండ‌లేక‌పోయారు. విడాకులు తీసుకుని ఎవ‌రి దారి వారు చూసుకున్నారు. అటు స‌మంత‌, ఇటు నాగ‌చైత‌న్య.. ఇద్ద‌రూ కెరీర్ ప‌రంగా బిజీ అయ్యారు.

త్వ‌ర‌లోనే నాగ‌చైత‌న్య `క‌స్ట‌డీ` అనే మూవీతో ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించ‌బోతున్నాడు. వెంకట్ ప్రభు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృతి శెట్టి హీరోయిన్ గా న‌టించింది. మ‌రికొద్ది రోజుల్లో ఈ మూవీ గ్రాండ్ రిలీజ్ కాబోతోంది. అయితే తాజాగా నాగ‌చైత‌న్య ఓ యూట్యూబ్ పాడ్ కాస్ట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా డేర్ అండ్ ట్రూత్ సెగ్మెంట్ లో ఇంటర్వ్యూర్ ఆసక్తికర ప్రశ్న అడిగారు.

మీ జీవితంలో అతిపెద్ద ప్రశ్యాతాపం ఏంటీ అని అడ‌గ‌గా.. ‘నా జీవితంలో అలాంటిది ఏం లేదు, ప్రతిదీ ఓ పాఠమే’ అని చైతు బదులిచ్చారు. విడాకుల‌ తర్వాత ఏదైనా బాధపడ్డ ఘటన, సినిమాల పరంగానైనా ఉందా..? అని మ‌రో ప్ర‌శ్న వేయ‌గా చైతు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశాడు. `సినిమాల పరంగా చాలా బాధపడ్డ ఘటనలు ఉన్నాయి. రెండు మూడు చిత్రాల విషయాల్లో మాత్రం రిగ్రీట్ గా ఫీల్ అయ్యాను` అని స‌మాధానం ఇచ్చాడు. దీంతో చైతు కామెంట్స్ నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి.

Share post:

Latest