అల్ల‌రి న‌రేష్ `ఉగ్రం`ను రిజెక్ట్ చేసిన నంద‌మూరి హీరో ఎవ‌రో తెలుసా?

`నాంది` మూవీతో మంచి కంబ్యాక్ ఇచ్చిన అల్ల‌రి న‌రేష్‌.. ఇప్పుడు `ఉగ్రం`తో విశ్వ‌రూపం చూపించేందుకు సిద్ధం అవుతున్నారు. విజయ్‌ కనకమేడల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో మిర్ణా మీనన్ హీరోయిన్ గా న‌టించింది. షైన్‌ స్క్రీన్‌ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్‌ పెద్ది నిర్మించిన ఈ సినిమా మే 5న విడుద‌ల కాబోతోంది.

ఇప్ప‌టికే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ జోరుగా సాగుతున్నారు. అల్ల‌రి న‌రేష్ బ్యాక్ టు బ్యాక్ ఇంట‌ర్వ్యూల్లో పాల్గొంటూ సినిమాపై మంచి హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఈ సినిమాపై అల్ల‌రి న‌రేష్ చాలా న‌మ్మ‌కంగా ఉన్నాడు. అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెర‌పైకి వ‌చ్చింది.

అదేంటంటే.. `ఉగ్రం` సినిమాకు ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ కాద‌ట‌. మొద‌ట ఈ సినిమాను ఓ నంద‌మూరి హీరో రిజెక్ట్ చేశాడ‌ట‌. ఆ హీరో మ‌రెవ‌రో కాదు క‌ళ్యాణ్ రామ్‌. డైరెక్ట‌ర్ విజ‌య్ క‌న‌క‌మేడ‌ల ఉగ్రం క‌థ‌ను మొద‌ట క‌ళ్యాణ్ రామ్ వ‌ద్ద‌కు తీసుకెళ్లార‌ట‌. కానీ, ఏదో కార‌ణాల వ‌ల్ల ఆయ‌న ఈ ప్రాజెక్ట్ ను సున్నితంగా రిజెక్ట్ చేశార‌ట‌. అయితే కళ్యాణ్ రామ్ కు చెప్పినప్పుడు కేవలం ఐడియా మాత్రమే. నరేష్ కి ఫుల్ స్క్రిప్ట్ చెప్పడంతో ఆయన వెంటనే ఓకే చేశార‌ట‌. ఈ మూవీ అల్ల‌రోడికి ఎలాంటి ఫ‌లితాన్ని అందిస్తుందో చూడాలి.

Share post:

Latest