ఆ క్రికెట‌ర్ అంటే పిచ్చి.. ఈసారి ఐపీఎల్ క‌ప్ ఆ టీమ్‌కే అంటున్న‌ ర‌ష్మిక‌!

అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో మార్చి 31న ఐపీఎల్-2023 అట్ట‌హాసంగా ప్రారంభం అయిన సంగ‌తి తెలిసిందే. ప్రారంభోత్స‌వ కార్య‌క్ర‌మంలో నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా స్పెష‌ల్ ప‌ర్ఫామెన్స్ తో అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. అయితే తాజాగా రష్మిక ‘స్టార్‌స్పోర్ట్స్’ తో ముచ్చ‌టించింది.

ఈ సంద‌ర్భంగా ఐపీఎల్‌లో తనకు ఇష్టమైన టీమ్ ఏది..? ఫెవ‌రెట్ క్రికెట‌ర్ ఎవ‌రు..? వంటి విష‌యాల‌ను వెల్ల‌డించింది. టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అంటే తనకు పిచ్చ‌ని.. అత‌డి దూకుడు, ఆట‌తీరు త‌న‌కెంతో ఇష్ట‌మ‌ని ర‌ష్మిక పేర్కొంది. బెంగళూరు అమ్మాయిగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) జట్టునే ఇష్ట‌ప‌డ‌తాన‌ని.. ఈసారి ఐపీఎల్ క‌ప్ ఆర్‌సీబీకే అని పేర్కొంది. `ఈ సాలా కప్ నమ్దే`(ఈ ఏడాది కప్పు మనదే) అంటూ ర‌ష్మిక నినాదం కూడా చేసింది.

దీంతో ర‌ష్మిక కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి. కాగా, సినిమాల విష‌యానికి వ‌స్తే.. ఈ బ్యూటీ ప్ర‌స్తుతం బాలీవుడ్ లో ర‌ణ‌బీర్ క‌పూర్ జోడీగా `యానిమ‌ల్‌`, టాలీవుడ్ లో అల్లు అర్జున్ స‌ర‌స‌న `పుష్ప 2` చిత్రాలు చేస్తోంది. వీటితో పాటు రీసెంట్ గా `రెయిన్ బో` అనే లేడీ ఓరియెంటెడ్ మూవీకి సైన్ చేసింది. ఇందులో `శాకుంత‌లం` ఫేమ్ దేవ్ మోహ‌న్ హీరోగా న‌టిస్తున్నాడు.

Share post:

Latest