ఎమ్మెల్యేలకు యాంటీ..సొంత వాళ్లే రివర్స్.!

ఏపీలో అధికార వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. కొంతమంది ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఎక్కువగానే ఉంది. అయితే ఎలాగోలా సంక్షేమ పథకాలు అందిస్తూ..గడపగడపకు, మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమాలు పెడుతూ..ప్రజా మద్ధతు తగ్గకుండా ఉండటానికి జగన్ కష్టపడుతున్నారు. కానీ ఎమ్మెల్యేలు మాత్రం జగన్ కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా చేస్తున్నారు. పలువురి ఎమ్మెల్యేల పనితీరు ఏ మాత్రం బాగోలేదు.

ఇంకా దారుణమైన విషయం ఏంటంటే..కొంతమంది ఎమ్మెల్యేలు ప్రజల్లో వ్యతిరేకత తెచ్చుకోవడం కాదు..సొంత పార్టీ శ్రేణుల వ్యతిరేకతని కూడా తెచ్చుకుంటున్నారు. అంటే ఎమ్మెల్యేల తీరు అలా ఉంది. తాజాగా ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజుకు ఓ గ్రామంలో నిరసన సెగ తగిలింది. అక్కడ ఎమ్మెల్యే వైఖరికి వ్యతిరేకంగా సొంత పార్టీ వాళ్ళే గళం విప్పారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యే ఓ వ్యక్తిపై చేయి చేసుకున్నారు. ఇప్పుడు ఆ అంశం ఎమ్మెల్యేకు మరింత నెగిటివ్ అయింది.

ఇక ఇటు పెనుకొండ ఎమ్మెల్యే శంకర్ నారాయణకు కూడా అలాగే నిరసన సెగ తగిలింది. సొంత పార్టీ నేతలే ఎమ్మెల్యేని అడ్డుకున్నారు..చెప్పులతో దాడి చేయడానికి చూశారు. అంటే ఎమ్మెల్యే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. ఇలా సొంత పార్టీ వాళ్లే ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా మారుతున్నారు. అటు చిలకలూరిపేటలో మంత్రి విడదల రజిని పరిస్తితి కూడా అలాగే ఉంది. గడపగడపకు వెళ్లినప్పుడు ఆమెకు సొంత పార్టీ వాళ్లే సహకరించడం లేదు.

ఇలా చాలామంది ఎమ్మెల్యేల పరిస్తితి ఉంది. ప్రజల్లోనే కాదు..సొంత పార్టీలో కూడా ఎమ్మెల్యేలు వ్యతిరేకత తెచ్చుకుంటున్నారు..అంటే వైసీపీ పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. e