సీమలో సీన్ ఛేంజ్..వైసీపీని నిలువరిస్తారా?

రాయలసీమ..వైసీపీ కంచుకోట..గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే హవా. అసలు గత ఎన్నికల్లో ఊహించని విధంగా వైసీపీ విజయం సాధించింది. సీమలో ఉమ్మడి నాలుగు జిల్లాల్లో కలిపి మొత్తం 52 సీట్లు ఉండగా, వైసీపీ ఏకంగా 49 సీట్లు గెలుచుకుంది. టి‌డి‌పికి కేవలం 3 సీట్లు మాత్రం దక్కాయి..అంటే అక్కడ వైసీపీ ఏ విధంగా వన్ సైడ్‌గా గెలిచిందో అర్ధం చేసుకోవచ్చు.

అలా వైసీపీ హవా ఉన్న సీమలో పట్టు సాధించాలని టి‌డి‌పి చూస్తుంది. ఈ సారి ఎన్నికల్లో సీమలో సగం సీట్లు అయినా గెలవాలని అనుకుంటుంది. ఎలాగో ఆధిక్యం మాత్రం వైసీపీకే దక్కేలా ఉంది. కాబట్టి అక్కడ సగం సీట్లు వచ్చిన సరిపోతాయని విధంగా టి‌డి‌పి భావిస్తుంది. 2014 ఎన్నికల్లో వైసీపీ 30 సీట్లు గెలిస్తే..టి‌డి‌పి 22 సీట్లు గెలిచింది. ఆ ఎన్నికల మాదిరిగానే..ఇప్పుడు 2024లో కూడా టి‌డి‌పి 22 సీట్లు గెలిచిన చాలు..రాష్ట్రంలో అధికారంలో కైవసం చేసుకునే అవకాశాలు ఉన్నాయి.

అలా సత్తా చాటాడానికి టి‌డి‌పి వ్యూహాత్మకంగా ముందుకెళుతుంది. ఈ క్రమంలోనే సీమలో అత్యధికంగా ప్రభావం చూపే రెడ్డి వర్గానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. రెడ్డి వర్గం వైసీపీకే ఎక్కువ సపోర్ట్. ఇప్పుడు వారిని ఇటు టి‌డి‌పి వైపు తిప్పాలని చూస్తున్నారు. అందుకే ఈ సారి రెడ్డి వర్గనికి ఎక్కువ సీట్లు ఇవ్వడానికి చంద్రబాబు ప్లాన్ చేస్తున్నారు.

కడపలో అత్యధికంగా రెడ్లకు సీట్లు ఇచ్చి..అనంతపురంలో రెడ్లు, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. ఇటు చిత్తూరులో రెడ్లతో పాటు కమ్మ, బలిజ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని చూస్తున్నారు. కర్నూలులో మెజారిటీ సీట్లు రెడ్లకే ఇవ్వనున్నారు. ఎలాగో రిజర్వడ్ సీట్లలో ఎస్సీలు పోటీ చేస్తారు. మరి చూడాలి సీమలో టి‌డి‌పి ఏ మేర సత్తా చాటుతుందో.