ప్రముఖ నటి మీనా ఒకప్పటి హీరోయిన్గా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. అందం, అభినయంతో ఎంతోమంది కుర్రకారుల మనసు దోచుకున్న మీనా ఎన్నో చిత్రాలలో నటించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ కూడా అడపా దడపా చిత్రాలలో నటిస్తూ కనిపిస్తోంది. గత కొద్ది రోజుల క్రితం మీనా భర్త విద్యాసాగర్ మరణించిన సంగతి తెలిసిందే ..ఈ విషాదం నుంచి ఈమె ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. తన భర్త చనిపోవడంతో కుటుంబ సభ్యులు రెండో వివాహం చేసుకోవాలంటు ఒత్తిడి చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి.
ఇదంతా ఇలా ఉంటే తమిళనాడులో రజనీకాంత్ తర్వాత ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరోలలో అజిత్ కుమార్ కూడా ఒకరు. తమిళంలో పాటు తెలుగులో కూడా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు.. వరుస సినిమాలతో గట్టి పోటీగా నిలుస్తున్న అజిత్ ప్రస్తుతం మాస్ హీరోగా మారిపోయి పలు చిత్రాల సక్సెస్ను తన ఖాతాలో వేసుకున్నారు. ఇటీవల హీరో అజిత్ మరొక వ్యాపారాన్ని కూడా మొదలుపెట్టారు ఏకే మోటర్ రైట్స్ అనే కంపెనీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.
నీకు అసలు విషయంలోకి వెళ్తే గతంలో మీనా ,అజిత్ కలిసి ఆనంద పూంకట్రు అనే చిత్రంలో నటించారు ఈ సినిమా అప్పట్లో మంచి విజయాన్ని అందుకోవడంతో అజిత్ కు ఉత్తమ నటుడుగా అవార్డు కూడా లభించింది. ఈ సందర్భంగా ఈ వేదికపై అజిత్, మీనాకు అవార్డు ఇవ్వడం జరిగింది.. అయితే అక్కడున్న యాంకర్ వీరిద్దరిని కలిసి స్టేజ్ పైన డాన్స్ వేయమని కోరగా ఇది విన్న మీనా తల్లి వెంటనే స్టేజి మీదకు వచ్చి మీనా చెయ్యి పట్టుకుని తీసుకువెళ్లింది.. దీంతో అక్కడున్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యి.. మీనా తల్లి ఇలా చేయడంతో అజిత్ అందరి ముందు అవమానపడ్డారని కొంతమంది నటీనటులు తప్పు పట్టారు. మరి ఇలా ఎందుకు చేసిందని విషయం ఇంకా ఇప్పటికి తెలియలేదు.