ప‌విత్ర మీ ఆస్తిని చూసి వ‌చ్చిందా అన్న ప్ర‌శ్న‌కు న‌రేష్ దిమ్మ‌తిరిగే ఆన్సర్‌!

ప్రస్తుతం టాలీవుడ్ లో నరేష్-పవిత్రల వ్య‌వ‌హారం ఎంతటి హార్ట్ టాపిక్ గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గ‌త‌ కొన్నేళ్ల నుంచి సహజీవనం చేస్తున్న ఈ జంట.. త్వ‌ర‌లోనే పెళ్లి కూడా చేసుకుంటామని అధికారికంగా ప్రకటించారు. అలాగే వీరిద్దరూ ప్రధాన పాత్రలో న‌టించిన `మళ్ళీ పెళ్లి` చిత్రం ఇటీవ‌లె ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది.

ఈ సినిమా న‌రేష్‌-ప‌విత్ర బ‌యోపిక్ అన‌డంలో సందేహం లేదు. అయితే టీజ‌ర్, ట్రైల‌ర్ తో అంచ‌నాలు బాగానే పెంచినా.. సినిమా మాత్రం ఆ అంచ‌నాల‌ను అందుకోలేక‌పోయింది. ఇక‌పోతే ఈ సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఓ ఇంట‌ర్వ్యూలో పాల్గొన్న‌ న‌రేష్ కు.. `పవిత్ర మీ ఆస్తిని చూసి వచ్చిందా లేక మిమ్మల్ని చూసా..?` అనే ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న ఎదురైంది.

ఆ ప్ర‌శ్న‌కు న‌రేష్ దిమ్మ‌తిరిగే ఆన్స‌ర్ ఇచ్చాడు. కన్ఫ్యూజన్ లేకుండా క్లారిటీగా స‌మాధానం ఇచ్చాడు. `నాకు ఆస్తి లేనపుడు వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అలాగే నా ఆస్తి చూసి ఇష్టపడి వచ్చినవాళ్ళు ఉన్నారు. ప్రేమకు, వ్యామోహానికి నాకు తేడా తెలుసు. కానీ, పవిత్ర అలా కాదు. నిస్వార్ధమైన మనస్సు ఆమె సొంతం. నా ఆస్తిని కాదు.. న‌న్ను ఆమె మ‌న‌స్పూర్తిగా ప్రేమించింది. అదే నాకు న‌చ్చింది` అంటూ న‌రేష్ వెల్ల‌డించారు. దీంతో కామెంట్స్ కాస్త నెట్టింట వైర‌ల్ గా మారాయి.