గత కొన్ని రోజులుగా విజయవాడ రాజకీయాల్లో టీడీపీ ఎంపీ కేశినేని నాని వ్యవహారం హాట్ టాపిక్ గా నిలుస్తున్న విషయం తెలిసిందే. ఈయన ప్రత్యర్ధి పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ సొంత పార్టీ పైనే విమర్శలు చేసే పరిస్తితి ఉంది. అయితే విజయవాడ ఎంపీగా..పార్లమెంట్ పరిధిలో ఉండే ఎమ్మెల్యేలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని అంటున్నారు. అదే సమయంలో విజయవాడలో కొందరు టిడిపి నేతలతో కేశినేనికి పడని విషయం తెలిసిందే.
కానీ వైసీపీ ఎమ్మెల్యేలతో కలిసి ముందుకెళుతూ..వారిని పొగుడుతూ కేశినేని ముందుకెళుతున్నారు. దీంతో టిడిపి నేతలకు ఇబ్బంది అవుతుంది. రాజకీయంగా టిడిపికి కాస్త నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే కేశినేని టిడిపికి దూరం జరిగినట్లే కనిపిస్తున్నారు. ఈ క్రమంలో ఆయనకు వైసీపీ ఆహ్వానం ఇచ్చింది. కేశినేని వైసీపీలోకి వస్తే తప్పకుంగా ఆహ్వానిస్తామని వైసీపీ ఎంపీ ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి అన్నారు. అదే సమయంలో దేవినేని ఉమా వైసీపీకి అనుకూల శత్రువు అని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ అన్నారు.
ఉమా గతంలో గ్రావెల్, ఇసుక దోచుకుని ఎదిగారని, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఉమాపై గెలవడమనేది తనకు బలుపే అని వసంత అంటున్నారు. ఉమా వ్యవహారశైలి వల్లే కొడాలి నాని, వల్లభనేని వంశీ టిడిపిని వదిలి వైసీపీలోకి వచ్చారని చెప్పారు.
ఉమా ఎక్కడకు వెళ్ళిన అక్కడ టిడిపికి 500 ఓట్లు తగ్గడం గ్యారెంటీ అని అంటున్నారు. ఉమా నందిగామలో టిడిపికి ప్రచారం చేస్తే అక్కడ వైసీపీ మళ్ళీ గెలవడం ఖాయమని చెబుతున్నారు. మొత్తానికి బెజవాడ రాజకీయాల్లో దేవినేని ఉమా, కేశినేని నాని అంశం పెద్ద చర్చగా మారింది.