మహేష్ బాబు పై అలాంటి వ్యాఖ్యలు చేసిన డైరెక్టర్ తేజ..!!

టాలీవుడ్ హీరో మహేష్ బాబు డైరెక్టర్ తేజ కాంబినేషన్లో వచ్చిన చిత్రం నిజం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అయితే అందుకోలేకపోయింది…. జయం వంటి సూపర్ హిట్ సినిమా అందుకున్న తేజ కాంబినేషన్లో సినిమా వస్తోంది అంటే ప్రేక్షకులకు భారీ అంచనాలు ఉండేవి.. ముఖ్యంగా గోపీచంద్ విలన్ కావడం చేత రక్షిత హీరోయిన్గా ఉండడంతో పాటు రాశి ఒక కీలకమైన పాత్రలో నటించింది అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.. అయితే ఈ సినిమాల నటించిన వారి నటనకి మాత్రం మంచి మార్కులే పడ్డాయని చెప్పవచ్చు. ఈ చిత్రానికి ఎన్నో అవార్డులు కూడా వచ్చాయి.

Teja Analyzes Nijam Failure | cinejosh.com

ముఖ్యంగా మహేష్ బాబు ఈ చిత్రంలోని పాత్రలో జీవించేసాడు.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న తేజ.. మహేష్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.. తేజ దర్శకత్వంలో వచ్చిన సినిమాలలో అందరి హీరోలలో మహేష్ బాబుని బెస్ట్ అని తెలియజేశారు.. మిగతా హీరోలంతా తేజకు కావాల్సిన ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి చాలా సమయం తీసుకుంటారని కానీ మహేష్ బాబు మాత్రం ఎలాంటి సన్నివేశంలోనైనా సరే పాత్రలో ఇవ్వాల్సిన ఎక్స్ప్రెషన్ ని కరెక్ట్ గా ఇస్తారని తెలిపారు.

తేజ ప్రస్తుతం అహింస అనే చిత్రాన్ని తెరకెక్కించారు. రానా సోదరుడు అభిరామ్ హీరోగా పరిచయం చేస్తున్నారు. ఈ సినిమా నుంచి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంటుంది.జూన్ 2 వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. ఇందులో భాగంగానే వరుస ఇంటర్వ్యూలో పాల్గొన్న చిత్ర బృందం.. తో పాటు డైరెక్టర్ కూడా ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి మరి.