కేసీఆర్ క్లియర్ స్ట్రాటజీ..సిట్టింగులకు షాక్ తప్పదు.!

వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలిచి తెలంగాణలో హ్యాట్రిక్ సాధించాలని కే‌సి‌ఆర్ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సారి కూడా విజయం సాధించే దిశగానే కే‌సి‌ఆర్ వ్యూహాలు ఉన్నాయి. ప్రత్యర్ధులకు చెక్ పెట్టే విషయంలో పదునైన వ్యూహాలు వేస్తున్న కే‌సి‌ఆర్..సొంత పార్టీలోని తప్పులని సరిచేయడంలో కూడా అదే తరహాలో వెళుతున్నారు. ప్రస్తుతం పార్టీలో కొందరు ఎమ్మెల్యేలు పరిస్తితి పెద్దగా బాగోని విషయం తెలిసిందే.

సిట్టింగ్ ఎమ్మెల్యేలు అందరికీ సీట్లు ఇస్తే బి‌ఆర్‌ఎస్ పార్టీకే నష్టం జరుగుతుంది. అందుకే అలాంటిది జరగకుండా కే‌సి‌ఆర్ ముందు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గత ఎన్నికల్లో బి‌ఆర్‌ఎస్ 88 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. ఇక ఇతర పార్టీల నుంచి 15 మంది వరకు బి‌ఆర్‌ఎస్ లో చేరారు. ఇక ఉపఎన్నికల్లో గెలుపోటములని లెక్కలు తీసుకుని ప్రస్తుతం బి‌ఆర్‌ఎస్ పార్టీకి 104 మంది ఎమ్మెల్యేల వరకు ఉన్నారు. కాంగ్రెస్‌కు 5, బి‌జే‌పికి 3, ఎం‌ఐ‌ఎంకి 7 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు.

మొత్తం 119లో బి‌ఆర్‌ఎస్ పార్టీకి 104 మంది ఉన్నారు. అంటే దాదాపు 90 శాతం వరకు ఉన్నారు. మరి వీరందరికి నెక్స్ట్ సీట్లు ఇస్తారంటే..డౌట్ లేకుండా ఇవ్వరనే చెప్పాలి. 2018లో అప్పుడు కేవలం 7 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకే కే‌సి‌ఆర్ సీటు ఇవ్వలేదు. అప్పుడు పార్టీ గాలి ఎక్కువ ఉంది కాబట్టి ఇబ్బంది రాలేదు. మళ్ళీ పార్టీ గెలిచింది.

కానీ ఇప్పుడు ఆ పరిస్తితి కనిపించడం లేదు. ప్రతిపక్ష పార్టీలు బలపడుతున్నాయి. ఈ క్రమంలో బి‌ఆర్‌ఎస్ జాగ్రత్తగా ఉండాలి. ప్రజా వ్యతిరేకత ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేలని పక్కన పెట్టాలి. అప్పుడే బి‌ఆర్‌ఎస్ పార్టీకి మంచి అవకాశాలు ఉంటాయి. ఇదే క్రమంలో దాదాపు 25 మందికి సీట్లు ఇవ్వడం కష్టమే అని తెలుస్తుంది. అప్పుడే బి‌ఆర్‌ఎస్ గెలుపు సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు. చూడాలి మరి కే‌సి‌ఆర్ ఎంతమంది సిట్టింగులకు హ్యాండ్ ఇస్తారో.