ఉత్తరాంధ్రపై బాబు ఫోకస్..వైసీపీ సిట్టింగులపై పట్టు.!

వచ్చే ఎన్నికల్లో గెలిచి అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా టి‌డి‌పి అధినేత చంద్రబాబు పనిచేస్తున్న విషయం తెలిసిందే. ఎలాగైనా గెలిచి తీరాలని చెప్పి ఎప్పుడు ప్రజల్లోనే తిరుగుతున్నారు. ఓ వైపు నారా లోకేష్ పాదయాత్రతో ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఇటు చంద్రబాబు బాదుడేబాదుడు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి పేరుతో రోడ్ షోలు, భారీ సభలతో ప్రజల్లో ఉంటున్నారు. గత నెలలో బాబు..కృష్ణా జిల్లా, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో వరుసగా పర్యటించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు బాబు ఉత్తరాంధ్రలో పర్యటించడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 10 నుంచి శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పాతపట్నం నియోజకవర్గంతో రోడ్ షో, భారీ సభ నిర్వహించనున్నారు. ఆ తర్వాత విజయనగరం జిల్లాలో పార్వతీపురం పరిధిలో బాబు పర్యటిస్తున్నారు. అయితే ఈ స్థానాలు పూర్తిగా వైసీపీకి పట్టున్న స్థానాలే. ఇప్పుడు ఆ స్థానాల్లో పట్టు సాధించాలని చంద్రబాబు చూస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరాలని చూస్తున్నారు. ఇప్పటికే కీలక స్థానాల్లో అభ్యర్ధులని కూడా ఖరారు చేస్తూ వస్తున్నారు.

ఇక నెక్స్ట్ విశాఖలో బాబు టూర్ ఉండనుంది. ఈ నెల  17న పెందుర్తి నియోజకవర్గంలో బాబు పర్యటన ఉంది. ఆ తర్వాత విజయనగరంలోని శృంగవరపుకోట నియోజకవర్గంలో బాబు కార్యక్రమం ఉండనుంది. ఇలా ఉత్తరాంధ్రపై బాబు ఫోకస్ చేస్తున్నారు. అక్కడ ఆధిక్యం సాధించడం లక్ష్యంగా బాబు పర్యటన ఉండనుంది.

ఇప్పటికే అక్కడ టి‌డి‌పి పట్టు సాధిస్తుంది..ఇప్పుడు బాబు టూర్లతో ఉత్తరాంధ్రలో టి‌డి‌పి బలం మరింత పెరిగే ఛాన్స్ ఉంది. గత ఎన్నికల్లో ఉత్తరాంధ్రలో 34 సీట్లు ఉంటే వైసీపీ 28 సీట్లు సాధించింది. ఈ సారి టి‌డి‌పికి లీడ్ వచ్చేలా ఉంది.