May day – చిరు భోళా శంకర్ రిలీజ్ డేట్ ఫిక్స్..!!

తెలుగు సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది మొదట్లో వాల్తేరు వీరయ్య సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్నారు. తాజాగా డైరెక్టర్ మెహర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం కూడా భారీ బడ్జెట్ తోనే తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి సడన్ సర్ప్రైజ్ గా మేడే సందర్భంగా విడుదల చేయడం జరిగింది.

Image

ఇలా విడుదలైన చిరంజీవి పోస్టర్లో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్ గా ఈ చిత్రంలో మరొకసారి కనిపించబోతున్నారు. ఈ పోస్టర్ తో చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. చిరంజీవి లుక్ చూస్తూ ఉంటే వింటెజ్ చిరంజీవిని చూసినట్లుగా ఉందని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. గత కొద్ది రోజులుగా ఈ సినిమా విడుదల తేదీ పై పుకార్ల సైతం వినిపిస్తూ ఉన్నాయి. మే డే సందర్భంగా స్పెషల్ పోస్టర్ తో క్లారిటీ ఇవ్వడం జరిగింది. తాజా పోస్టర్లో ఈ సినిమా ఆగస్టు 11 2023న విడుదల చేయబోతున్నట్లు తెలియజేయడం జరిగింది.

ఈ సినిమా షూటింగ్ బ్యాలెన్స్ కాస్త ఉంది కనుక ఆగస్టులో ఈ సినిమా రావడం కాస్త అనుమానంగా ఉన్నట్లుగానే ప్రకటించారు. కానీ ఎట్టకేలకు ఈ విషయంపై ఈ రోజున క్లారిటీ ఇవ్వడంతో కాస్త అభిమానులు సంబరపడుతున్నారు. చిరంజీవి చెల్లెలు పాత్రలో కీర్తి సురేష్ నటించగా.. తమన్నా హీరోయిన్గా నటిస్తోంది. అలాగే వెన్నెల కిషోర్ తో పాటు మరికొంతమంది కమెడియన్లు ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు. మరి ఆగస్టు 11న విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఏ విధంగా మెప్పిస్తుందో చూడాలి మరి.

Share post:

Latest