అందంతో అప్సరసల మెరిసిపోతున్న శ్రీయ..!!

తెలుగు ఇండస్ట్రీకి మొట్టమొదటిగా ఇష్టం అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది శ్రీయ శరణ్. ఇక ఆ తరువాత నేనున్నాను అనే సినిమాతో మోస్ట్ పాపులారిటీని సంపాదించుకుంది. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు తెలుగు ప్రేక్షకులు ఈమెను ఆదరిస్తూ ఉన్నారు. ఇక శ్రీయ ఇండస్ట్రీకి వచ్చి 22 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి అంటే ఆమె ఏ రేంజ్ లో ప్రేక్షకులను అలరిస్తోందో అర్థం చేసుకోవచ్చు.

ఒకప్పుడు స్టార్ హీరోలతో నటించి పెళ్లి చేసుకొని సిల్వర్ స్క్రీన్ కి దూరం అవుతుందని అనుకుంటే.. వరుస అవకాశాలను అందుకొని..వదలకుండా దూసుకుపోతోంది. శ్రీయ ఇక పెళ్లి తరువాత తనకు వచ్చిన పాత్రలను వదలకుండా చేస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఈ మధ్యనే ఆస్కార్ అవార్డును గెలిచిన ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కూడా చిన్న పాత్రతో ప్రేక్షకులను మెప్పించింది.

ఇప్పటికీ తన అందంతో.. తన గ్లామర్ తో ఏ మాత్రం తగ్గకుండా ప్రదర్శన చేస్తూ వస్తోంది శ్రీయ.. అయితే ఈ మధ్య తీసే సినిమాలలో ఆమె గ్లామర్ షో కి ఛాన్సులు దొరకలేదు. అందుకని తన ఫోటోషూట్స్ తో తన గ్లామర్ తో ప్రేక్షకుల కళ్ళు చెదిరేలా ఫోటోలకు ఫోజులిస్తోంది. తన గ్లామర్ తో ఆ ఫోటోలను చూస్తుంటే అదరహో అనాల్సిందే. తనకు 40 ఏళ్లవయస్సు వచ్చినా కూడా ఆమె అందం ఏమాత్రం తగ్గలేదు. అంటూ అచ్చం పదహారణాల పడుచు పిల్లలా కనిపిస్తుంది.

శ్రీయ లేటెస్ట్ ఫోటోస్ చూసిన వారంతా అమ్మడు అందం తినేస్తోందా ఏంటి అని కామెంట్ చేస్తున్నారు. ఇది కాస్త పక్కన పెట్టి సినిమాల విషయానికి వస్తే .. దృశ్యం 2 ని హిందీలో చేసింది. ఆ సినిమా మంచి హిట్టును సాధించి శ్రీయ తన ఖాతాలో వేసుకుంది. ఆ తరువాత కబ్జాలోహీరోయిన్గా నటించింది. ఇక త్వరలోనే మ్యూజిక్ స్కూల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

ఏదేమైనా శ్రియ ఒక బిడ్డకు జన్మనిచ్చి ఇంతటి అందాన్ని మెయింటైన్ చేస్తుందంటే మిగతా హీరోయిన్స్ షాక్ అవ్వాల్సిందే.

 

View this post on Instagram

 

A post shared by Shriya Saran (@shriya_saran1109)

Share post:

Latest