40లోనూ త‌గ్గేదేలే.. జ్యోతిక చేసిన ప‌నికి షాకైపోతున్న నెటిజ‌న్లు!

జ్యోతిక గురించి ప్ర‌త్యేక‌మైన ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన జ్యోతిక‌.. కోలీవుడ్ హీరో సూర్య‌ను ప్రేమించి కెరీర్స్ పీక్స్ లో ఉన్న‌ప్పుడే పెళ్లి చేసుకుంది. వివాహం అనంత‌రం సినిమాల‌కు దూర‌మై సంపూర్ణ గృహిణిగా మారింది. ఇద్ద‌రు పిల్ల‌ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఇప్పుడు పిల్ల‌లు పెద్ద‌వారు కార‌వ‌డంతో.. మ‌ళ్లీ కెరీర్ పై ఫోక‌స్ పెట్టింది.

సెకెండ్ ఇన్నింగ్ ప్రారంభించి త‌న వ‌య‌సుకు త‌గ్గా పాత్ర‌లు చేస్తూ ప్రేక్ష‌కుల‌ను మెప్పించారు. అలాగే భ‌ర్త‌తో క‌లిసి సినిమాలు నిర్మిస్తూ నిర్మాత‌గా స‌త్తా చాటుతోంది. ప్రస్తుతం జ్యోతిక వయసు 44 ఏళ్ళు. ఈ వయసులో కూడా త‌గ్గేదేలే అంటూ జ్యోతిక జిమ్ లో క‌ఠిన‌మైన వర్కౌట్స్ చేస్తోంది. తన ఫిజిక్ కాపాడుకుంటోంది.

సోష‌ల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటే జ్యోతిక‌.. తాజాగా ఓ వీడియోను పంచుకుంది. ఈ వీడియో చూసి నెటిజ‌న్లు షాకైపోతున్నారు. ఒళ్ళు గగుర్పొడిచే విధంగా జ్యోతిక జిమ్ ఫీట్స్ చేస్తూ అంద‌రి ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. హీరోలు కూడా చేయ‌ని విధంగా రిస్కీ వర్కౌట్స్ చేస్తూ ఆక‌ట్టుకుంది. దీంతో జ్యోతిక‌ను నెటిజ‌న్లు తెగ పొగిడేస్తున్నారు. సూప‌ర్ వుమెన్ అంటూ కొనియాడుతున్నారు.

https://www.instagram.com/reel/Crkp7BPv16F/?utm_source=ig_web_copy_link

Share post:

Latest