వైసీపీలో బాలినేని సెగలు..ప్రకాశంలో డ్యామేజ్ తప్పదా?

వైసీపీలో ఆధిపత్య పోరు ఉన్న విషయం తెలిసిందే..అలాగే పార్టీలో కొందరు నేతలు అసంతృప్తిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇలా అసంతృప్తిగా ఉన్నవారు నిదానంగా పార్టీకి దూరమవుతున్నారు. ఇప్పటికే పలువురు నేతలు పార్టీకి దూరమయ్యారు. ఇదే క్రమంలో నలుగురు ఎమ్మెల్యేలు సైతం పార్టీకి దూరం జరిగారు. అటు మొన్నటివరకు పార్టీలో నెంబర్ 2 పొజిషన్ లో ఉన్న విజయసాయిరెడ్డి లాంటి వారే ఇప్పుడు సైలెంట్ గా ఉంటున్నారు.

ఇదే క్రమంలో ఊహించని విధంగా జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి..సొంత పార్టీపైనే అసంతృప్తిగా ఉన్నారు. ఎప్పుడైతే మంత్రి పదవి నుంచి తప్పించారో..అప్పటినుంచే బాలినేని అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోంది. పైగా ఇటీవల జిల్లాలో సి‌ఎం పర్యటన నేపథ్యంలో బాలినేనికి అవమానం జరిగింది. ఇలాంటి పరిస్తితుల నేపథ్యంలో తాజాగా వైసీపీకి బాలినేని షాక్ ఇచ్చారు. వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్త పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇలా పదవికి రాజీనామా చేయడంతో ప్రకాశం వైసీపీలో పెద్ద చిచ్చు రేగింది.

దీంతో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి..బాలినేనిని బుజ్జగించే పని లో పడ్డారు. కానీ బాలినేని ఎక్కడా వెనక్కి తగ్గడం లేదు. ఇటీవల సీఎంవో అధికారి ధనుంజయరెడ్డికి బాలినేని ఫోన్‌చేశారు. తాను తిరుపతి, కడప, నెల్లూరు జిల్లాల కో-ఆర్డినేటర్‌ పదవి నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నానని, పార్టీ అధినేత జగన్‌కు తెలియజేయాలని చెప్పినట్లు తెలిసింది.

బాలినేనికి ధనుంజయ రెడ్డికి సర్ది చెప్పడానికి చూశారు గాని..ఆయన ఎక్కడా వెనక్కి తగ్గినట్లు కనిపించలేదు. ఇటీవల మార్కాపురం సి‌ఎం సభలో ప్రోటోకాల్ విషయంలో బాలినేనిని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది. మొత్తానికి బాలినేని వ్యవహారం ప్రకాశం వైసీపీలో హాట్ టాపిక్ గా మారింది. దీని వల్ల ప్రకాశంలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలేలా ఉంది.