ఇటు షర్మిల..అటు అవినాష్..వైఎస్ ఫ్యామిలీకి ట్రబుల్.!

గత ఎన్నికల ముందు ఏ అంశమైతే రాజకీయంగా జగన్‌కు ప్లస్ అయిందో..ఇప్పుడు అదే అంశం రివర్స్ అవుతుంది. గత ఎన్నికల ముందు జగన్ సొంత బాబాయ్ వివేకా మర్డర్ జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇది చేసింది చంద్రబాబు, టి‌డి‌పి నేతలని జగన్ తో సహ వైసీపీ నేతలు ఆరోపించారు. దీంతో అపుడు జగన్‌కు సానుభూతి కలిసొచ్చింది. కానీ అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్ అవుతుంది. సి‌బి‌ఐ విచారణలో ఊహించని అంశాలు బయటకొస్తున్నాయి.

ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అలాగే జగన్ మరో బాబాయ్ వైఎస్ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఇప్పుడు జగన్ సోదరుడు వైఎస్ అవినాష్ రెడ్డి చుట్టూ కేసు నడుస్తోంది. ఆయన్ని సి‌బి‌ఐ అదుపులోకి తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక తనని అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని అవినాష్ తెలంగాణ హైకోర్టుకు వెళ్లారు. అలాగే ముందస్తు బెయిల్‌కు అప్ప్లై చేశారు. దీంతో కోర్టు 25వ తేదీ వరకు అరెస్ట్ వద్దని ఆదేశాలు ఇచ్చింది.

దీనిపై వివేకా కుమార్తె సునీత సుప్రీం కోర్టుకు వెళ్ళి..హైకోర్టు ఆదేశాలు రద్దు చేయాలని కోరింది. దీంతో విచారణ చేసిన సుప్రీం..హైకోర్టు తీర్పుని సస్పెండ్ చేసింది..సి‌బి‌ఐని అరెస్ట్ చేయవద్దని ఆదేశించలేమని చెప్పింది. దీంతో అవినాష్ అరెస్ట్ ఖాయమనే ప్రచారం నడుస్తోంది. ఇలా అవినాష్ పరంగా జగన్‌కు ఇబ్బంది వస్తే.

ఇటు తెలంగాణలో రాజకీయం చేస్తున్న జగన్ సోదరి షర్మిల సైతం తాజాగా అరెస్ట్ అయ్యారు. నిరుద్యోగ నిరసన అంటూ ఆమె పోరాటం చేయడాన్ని పోలీసులు అడ్డుకున్నారు. హౌస్ అరెస్ట్ చేయడానికి చూశారు. ఈ క్రమంలో ఆమె పోలీసులని నెట్టడం, కొట్టడం చేశారు. దీంతో ఆమెని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కోర్టు సైతం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. దీంతో ఆమెని చంచల్‌గూడ జైలుకు తరలించారు. మొత్తానికి ఇలా వైఎస్ ఫ్యామిలీకి ఇబ్బందులు వచ్చాయి.