గుంటూరులో బాబు టూర్..ఆ రెండు స్థానాల్లో పట్టు దొరుకుతుందా?

టి‌డి‌పి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పడిన ఏపీకి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా రాజధాని పెట్టిన సరే..ఆ ప్రాంత పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలవలేదు. గత ఎన్నికల్లో టి‌డి‌పి దారుణంగా ఓడింది. తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు, సత్తెనపల్లి, పొన్నూరు, వేమూరు, తెనాలి, ప్రత్తిపాడు..ఇలా అమరావతికి దగ్గరగా ఉన్న స్థానాల్లో ఓడింది.

అయితే జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని దెబ్బతీస్తూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వైసీపీపై వ్యతిరేకత మొదలైంది..అటు ప్రభుత్వ పరంగా కూడా తీవ్ర వ్యతిరేకత కనిపిస్తుంది. దీంతో అమరావతి ప్రాంత పరిధిలో వైసీపీకి యాంటీ ఉంది. కాకపోతే కొన్ని స్థానాల్లో టి‌డి‌పికి పాజిటివ్ కనిపించడం లేదు. నాయకత్వ లోపం ఉంది. నేతల మధ్య పోరు ఉంది. ఈ క్రమంలోనే చంద్రబాబు అమరావతి పర్యటనకు వస్తున్నారు. పెదకూరపాడు, సత్తెనపల్లి, తాడికొండ స్థానాల్లో ఆయన పర్యటించనున్నారు.

అయితే తాడికొండలో బలమైన నాయకత్వం ఉంది..అక్కడ గెలుపు విషయంలో ఎలాంటి డౌట్ లేదు. ఇక పెదకూరపాడు, సత్తెనపల్లి స్థానాల్లో వైసీపీకి యాంటీ ఉంది..కానీ టి‌డి‌పిలో నాయకత్వ పోరు ఉంది. సత్తెనపల్లి సీటు విషయంలో పలువురు నేతల మధ్య ఆధిపత్య పోరు ఉంది. దీంతో ఆ సీటు ఎవరికి ఇస్తారనే చర్చ సాగుతుంది. ఒకరికి ఇస్తే మరొకరు సహకరిస్తారో లేదో చూడాలి.

అటు పెదకూరపాడు సీటులో కాస్త క్లారిటీ ఉంది. మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్ ఉన్నారు. అయితే ఇంకా అక్కడ ఆయన బలపడాల్సి ఉంది. ఇప్పుడు బాబు పర్యటన ఉన్న నేపథ్యంలో టి‌డి‌పికి మరింత బలం పెరుగుతుందనే చెప్పాలి. చూడాలి మరి బాబు టూర్ తో అమరావతిలో టి‌డి‌పి హవా పెరుగుతుందేమో.