శ్రీదేవి భజన..బాబు సీటు ఇస్తారా?

ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ అధినేతలకు భజన చేసే నేతలకు కొదవ ఉండదనే చెప్పాలి. అలాంటి భజన చేయడంలో తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి తిరుగులేదనే చెప్పాలి. మొన్నటివరకు వైసీపీలో ఉన్న ఈమె..జగన్‌కు ఏ స్థాయిలో భజన చేసిందో చెప్పాల్సిన పని లేదు. ఆరోగ్య శ్రీతో గుండె ఆపరేషన్ చేయించుకున్న గుండె..జగన్ జగన్ అని కొట్టుకుంటుందని అసెంబ్లీ సాక్షిగా భజన చేశారు. అయితే ఈమె ఎమ్మెల్యేగా పూర్తిగా ఫెయిల్ అయ్యారు. తాడికొండ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో […]

అమరావతిలో జగన్..పెద్ద స్కెచ్‌తోనే..రివర్స్ అవుతుందా?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సి‌ఎం జగన్..అమరావతి ప్రాంతంలోనే ఉంటున్నారు. తాడేపల్లిలోనే ఉంటున్నారు కానీ..ఎప్పుడు అమరావతిలో పర్యటించలేదు..అక్కడి ప్రజలని పట్టించుకున్నట్లు కనిపించలేదు. పైగా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని అన్నారు. దీంతో అమరావతి రైతులు ఉద్యమ బాటపట్టారు. మూడేళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నారు. కానీ వారి పోరాటాలని జగన్ ప్రభుత్వం అణిచివేసే దిశగానే ముందుకెళ్లింది..ఎప్పుడు వారి సమస్యలని తెలుసుకోలేదు. అయితే అక్కడ వైసీపీపై వ్యతిరేకత పెరిగిందనే మాట వాస్తవం..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక […]

గుంటూరులో బాబు టూర్..ఆ రెండు స్థానాల్లో పట్టు దొరుకుతుందా?

టి‌డి‌పి అధికారంలోకి వచ్చాక కొత్తగా ఏర్పడిన ఏపీకి అమరావతిని రాజధానిగా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇలా రాజధాని పెట్టిన సరే..ఆ ప్రాంత పరిధిలో ఉన్న నియోజకవర్గాల్లో టి‌డి‌పి గెలవలేదు. గత ఎన్నికల్లో టి‌డి‌పి దారుణంగా ఓడింది. తాడికొండ, మంగళగిరి, పెదకూరపాడు, సత్తెనపల్లి, పొన్నూరు, వేమూరు, తెనాలి, ప్రత్తిపాడు..ఇలా అమరావతికి దగ్గరగా ఉన్న స్థానాల్లో ఓడింది. అయితే జగన్ అధికారంలోకి వచ్చాక అమరావతిని దెబ్బతీస్తూ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో వైసీపీపై […]

అమరావతిలో మరొక  పోరు..జగన్ స్కెచ్ అదిరింది.!

అమరావతిపై రాజకీయం కొనసాగుతూనే ఉంది. వైసీపీ ఏమో అమరావతిని దెబ్బతీయాలని, టి‌డి‌పి ఏమో అమరావతిని రాజధానిగా ఉంచాలని..ఇలా ఎవరికి వారు తమ వ్యూహాలతో ముందుకెళుతున్నారు. ఇప్పటికే మూడు రాజధానులు అని చెప్పి వైసీపీ..అమరావతిని ఎంతవరకు దెబ్బతీయాలో అంతవరకు దెబ్బతీసింది. కానీ అమరావతి కోసం అక్కడ ప్రజలు, ప్రతిపక్షాలు పోరాడుతూనే ఉన్నాయి. ఇక ఏదొక విధంగా ప్రతిపక్షాలకు చెక్ పెట్టి, అమరావతిని నిలువరించాలనేది వైసీపీ కాన్సెప్ట్. అయితే ఇప్పటికే వైసీపీ తీసుకున్న నిర్ణయాలు వివాదాస్పదం అయ్యాయి. ఈ క్రమంలో […]

అమరావతితో బీజేపీకి బెనిఫిట్..వైసీపీకి రివర్స్!

ఏపీలో ఏదొక విధంగా బలపడాలనే దిశగానే బీజేపీ ముందుకెళుతుంది..కానీ ప్రజలు ఎక్కడా కూడా బి‌జే‌పికి ఆ ఛాన్స్ ఇవ్వడం లేదు. కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రాష్ట్రాన్ని ఆదుకోవడం లేదనే అసంతృప్తి ప్రజల్లో ఉంది..దీంతో ప్రజలు బి‌జే‌పికి మద్ధతు ఇవ్వడం లేదు. కాకపోతే ఏదో రకంగా బీజీపీ ప్రజల్లోకి వెళ్లాలని చూస్తుంది. ఇదే క్రమంలో అమరావతి విషయంలో బి‌జే‌పి మద్ధతు పలికిన విషయం తెలిసిందే. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రాజధానులకు వ్యతిరేకంగా బి‌జే‌పి అమరావతి నినాదం […]

‘మూడు’పై వైసీపీ డైరక్ట్ ఎంట్రీ..సజ్జల కాన్సెప్ట్..!

అమరావతి విషయంలో సుప్రీం కోర్టులో కూడా వైసీపీ సర్కార్‌కు అనుకున్న మేర ఊరట రాలేదు. అమరావతి ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించలేదు. కానీ 6 నెలల్లోనే రాజధాని అభివృద్ధి చేయాలి..మూడు నెలల్లో రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి, నెలలో రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అంశాలపై మాత్రమే స్టే విధించింది. అలా అని రాజధానిలో అభివృద్ధి చేయవద్దని చెప్పలేదు. ఇలా అమరావతి అంశంపై వైసీపీ అనుకున్నట్లుగా […]

రాజధాని ఉద్యమం..ధర్మానతో ట్విస్ట్..?

ఎప్పుడైతే సీఎం జగన్ మూడు రాజధానులు అని ప్రకటించారో అప్పటినుంచి..అమరావతి ప్రాంత ప్రజలు, రైతులు..మూడు రాజధానులు వద్దు, అమరావతి ఏకైక రాజధానిగా ఉండాలని ఉద్యమం చేస్తున్న విషయం తెలిసిందే. రాజధాని వస్తుందనే తమ భూములు త్యాగం చేశామని, అలాంటిది రాజధాని ఏర్పాటు చేయకపోతే తామంతా రోడ్డుని పడతామని, అయినా రాష్ట్ర ప్రజల కోసం అమరావతిని రాజధాని కొనసాగించాలని దాదాపు మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. అమరావతికి టీడీపీ, జనసేన,బీజేపీ..ఇతర పార్టీలు మద్ధతు ఇస్తున్నాయి. ఒక్క వైసీపీ మాత్రం […]

రాజధాని రాజకీయం..బొత్స ‘నీతి’..!

ఏపీలో రాజధాని అంశంపై రచ్చ నడుస్తున్న విషయం తెలిసిందే. వైసీపీ అధికారంలోకి వచ్చి మూడు రాజధానులు అని అంశం తెరపైకి తీసుకొచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో రాజధానిపై రాజకీయం జరుగుతూనే ఉంది. వైసీపీ ఏమో మూడు రాజధానులు అని..అటు టీడీపీ ఏమో అమరావతి అని..అలాగే అమరావతి ప్రాంత రైతులు, ప్రజలు..ఒకే రాజధాని ఉండాలని అది కూడా అమరావతి ఉండాలని మూడేళ్ళ నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఇప్పుడు అమరావతి టూ అరసవెల్లి వరకు పాదయాత్ర చేస్తున్నారు. ఇదే క్రమంలో […]

ఉత్తరాంధ్రలో వార్..ఎవరూ తగ్గట్లేదుగా!

రాజధాని అంశంపై ఉత్తరాంధ్రలో పెద్ద రచ్చ నడుస్తోంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య రాజధాని విషయంలో మాటల యుద్ధం జరుగుతుంది. ఎప్పుడైతే అమరావతి ప్రాంత ప్రజలు..అమరావతి కోసం అరసవెల్లి వరకు పాదయాత్ర మొదలుపెట్టారో అప్పటినుంచి అసలు రచ్చ మొదలైంది. అప్పటివరకు అప్పుడప్పుడు మూడు రాజధానులు వచ్చేస్తాయని ప్రకటిస్తున్న మంత్రులు..ఇప్పుడు అదిగో మూడు రాజధానులు ఏర్పాటు చేసేస్తాం..అమరావతి రైతులది పాదయాత్ర కాదు…దండయాత్ర అని విమర్శలు చేస్తున్నారు. అది రియల్ ఎస్టేట్ వ్యాపారుల యాత్ర అని, అంతిమ […]