‘మూడు’పై వైసీపీ డైరక్ట్ ఎంట్రీ..సజ్జల కాన్సెప్ట్..!

అమరావతి విషయంలో సుప్రీం కోర్టులో కూడా వైసీపీ సర్కార్‌కు అనుకున్న మేర ఊరట రాలేదు. అమరావతి ఏకైక రాజధాని అని హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సుప్రీం కోర్టు స్టే విధించలేదు. కానీ 6 నెలల్లోనే రాజధాని అభివృద్ధి చేయాలి..మూడు నెలల్లో రైతుల ప్లాట్లు అభివృద్ధి చేసి ఇవ్వాలి, నెలలో రాజధానిలో మౌలిక సదుపాయాలు కల్పించాలి అని అంశాలపై మాత్రమే స్టే విధించింది. అలా అని రాజధానిలో అభివృద్ధి చేయవద్దని చెప్పలేదు.

ఇలా అమరావతి అంశంపై వైసీపీ అనుకున్నట్లుగా తీర్పు రాలేదు. అయితే మూడు రాజధానుల అంశంలో రాజకీయంగా ముందుకెళ్లాలని చెప్పి వైసీపీ ఎప్పటినుంచో ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. అమరావతికి ధీటుగా మూడు రాజధానుల ఉద్యమం వైసీపీ మొదలుపెట్టింది. అధికారంలో ఉండి కూడా వైసీపీ ఉద్యమం చేయడం కాస్త వింతగానే ఉంది. అయితే ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో రాజకీయ లబ్ది టార్గెట్ గా ఈ మూడు రాజధానుల ఉద్యమం అని క్లియర్ గా అర్ధమవుతుంది.

ఇప్పటికే విశాఖలో మూడు రాజధానులకు మద్ధతుగా ర్యాలీ నిర్వహించారు. ఇక ఇప్పుడు కర్నూలులో డిసెంబర్ 5న గర్జన సభ నిర్వహించడానికి సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటివరకు జే‌ఏ‌సి అంటూ, అందులో మూడు రాజధానుల పోరాటం చేశారు. కానీ ఇప్పుడు వైసీపీ డైరక్ట్ గా ఎంట్రీ ఇచ్చేస్తుంది. కర్నూలు సభ వైసీపీ ఆధ్వర్యంలోనే నడవనుంది.

ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డి..కర్నూలు వైసీపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు. 5న గర్జన సభకు భారీ స్థాయిలో జన సమీకరణ చేయాలని నేతలకు చెబుతున్నారు. పైగా ఇటీవల చంద్రబాబు కర్నూలు పర్యటనకు భారీ స్పందన వచ్చింది. దానికి ధీటుగా సభ నిర్వహించాలని చూస్తున్నారు. అయితే తాజాగా సుప్రీం కోర్టులో ప్రభుత్వ తరుపు న్యాయవాదులు..హైకోర్టు అమరావతిలోనే ఉందని స్పష్టం చేశారు. మరి అలాంటప్పుడు కర్నూలులో న్యాయ రాజధాని అని చెప్పి..అక్కడ ప్రజలని మభ్యపెడుతున్నారు అని టీడీపీ అంటుంది. మరి మూడు  రాజధానుల అంశంలో వైసీపీ ఏ మేర సక్సెస్ అవుతుందో చూడాలి.