టాలీవుడ్ లో హీరో ప్రభాస్ నటుడు గానే కాకుండా ఎంతో మంది అభిమానులను సంపాదించిన హీరోగా పేరు సంపాదించారు. ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా తన హవా కొనసాగిస్తూ ఉన్నారు. వరుస ప్లాపులతో సతమతమవుతున్న ప్రభాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ మాత్రం పెరుగుతూనే ఉందని చెప్పవచ్చు. హీరోయిన్ కృతి సనన్ మొదట నేనొక్కడినే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత దోచేయ్ వంటి సినిమాతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ఆ తర్వాత తెలుగులో ఏ చిత్రంలో కూడా నటించలేదు.
ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో ప్రభాస్ సరసన నటిస్తోంది.ఈ సినిమా షూటింగ్ సమయంలోనే ప్రభాస్, కృతి సనన్ ప్రేమలో పడ్డారని వార్తలు బాలీవుడ్ మీడియా నుంచి చాలా వైరల్ గా మారాయి.ఈ విషయంపై బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ కూడా భేడియా సినిమా ప్రమోషన్లలో భాగంగా పలు ఆసక్తికరమైన విషయాలు తెలియజేయడం జరిగింది. ఇటీవలే ఒక షో కి పాల్గొన్న వరుణ్ ధావన్, కృతి సనన్ కు సంబంధించి ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.
ఆ షోలో భాగంగా కరణ్ జోహార్ ఒక ప్రశ్న వేయగా… నీ పేరు ఎందుకు లేదు కృతి మనసులో అంటూ వరుణ్ ధావన్ ప్రశ్నించారు.అందుకు వరుణ్ ధావన్, కృతి మనసులో వేరొకరు ఉన్నారు.. అతను ముంబైలో లేరు ప్రస్తుతం దీపికా సినిమా షూటింగ్లో ఉన్నారని తెలియజేశారు.దీంతో ఒకసారిగా ప్రభాస్, కృతి మధ్య లవ్ ఎఫైర్ ఉందని వార్తలు మరింత వైరల్ గా మారాయి. అందుకు తగ్గట్టుగానే బాలీవుడ్ నటుడు ఉమైర్ సందు కూడా తన ట్విట్టర్ నుంచి.. త్వరలోనే ప్రభాస్ ,కృతి నిశ్చితార్థం జరగబోతోంది అని తన ట్విట్టర్ నుంచి తెలియజేశారు. అయితే అభిమానులు మాత్రం ఈ నటుడు చెప్పేవన్నీ అబద్ధాలు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అసలు ఈ విషయం ప్రభాస్ కైనా తెలుసా అంటూ సెటైర్లు వేస్తున్నారు.
Officially Confirmed ! #Prabhas proposed #KritiSanon during shoot of #Adipursh ! They are in relationship now !!! Engagement on the way very soon 🔥🕺🏻🕺🏻❤️❤️
— Umair Sandhu (@UmairSandu) November 28, 2022