సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా గుర్తింపు రావడానికి చాలా సమయం పడుతుంది. కొందరు హీరోయిన్లు తొలి సినిమాతోనే గుర్తింపు వస్తుంది. ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న ముద్దుగుమ్మ శ్రీ లీల. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రీ లీల తన అందం, అభినయంతో ప్రేక్షకులను ఆకట్టుకుని వరుస అవకాశాలను దక్కించుకుంటుంది. ఈమె నటించిన తొలి సినిమా యావరేజ్ గా నిలిచిన ఆ సినిమాలో తన నటనతో తన గ్లామర్ షోతో అభిమానులను ఆకట్టుకుంది.
ఆ తర్వాత టాలీవుడ్ లో ఉన్న యువ హీరోలు అందరూ ఈమె వెంటే పడుతున్నారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఈమె రవితేజ హీరోగా నటిస్తున్న ధమాకా సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. తర్వాత యువహీరో నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు, నితిన్ 32వ సినిమాలో హీరోయిన్గా, మరియు వైష్ణవి తేజ్ కొత్త సినిమాలు హీరోయిన్గా కన్ఫామ్ అయింది.
ఇక వీటితోపాటు స్టార్ దర్శకుడు అనిల్ రావుపూడి నందమూరి బాలకృష్ణ కాంబోలో వస్తున్న ఎన్.బి.కె 108వ సినిమాలో శ్రీ లీల బాలకృష్ణ కూతురుగా నటిస్తుంది. ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ కు జంటగా నటించబోతుందని తెలుస్తుంది. అయితే ఈ ముద్దుగుమ్మ అల్లు అర్జున్ కు జంటగా నటించేది సినిమాలో అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అది ఒక కమర్షియల్ యాడ్ ఫిలిం మాత్రమే. ఈ యాడ్ ను టాలీవుడ్ స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ తెరకెక్కిస్తుండగా. రవికే చంద్రన్ సినిమాటోగ్రాఫర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తుంది.
ప్రస్తుతం ఈ షార్ట్ ఫిలిం షూటింగ్ హైదరాబాదులో ఉన్న రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. షూటింగ్కు సంబంధించి అల్లుఅర్జున్, శ్రీ లీల, రవికేే చంద్రన్ ముగ్గురితో కలిసి దిగిన ఒక ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక దీంతో అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో రాబోయే సినిమాలో శ్రీ లీల హీరోయిన్గా నటించబోతుందని వార్తలు వైరల్గా మారాయి.