అమరావతిలో జగన్..పెద్ద స్కెచ్‌తోనే..రివర్స్ అవుతుందా?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి సి‌ఎం జగన్..అమరావతి ప్రాంతంలోనే ఉంటున్నారు. తాడేపల్లిలోనే ఉంటున్నారు కానీ..ఎప్పుడు అమరావతిలో పర్యటించలేదు..అక్కడి ప్రజలని పట్టించుకున్నట్లు కనిపించలేదు. పైగా అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అని అన్నారు. దీంతో అమరావతి రైతులు ఉద్యమ బాటపట్టారు. మూడేళ్ళ నుంచి పోరాటాలు చేస్తున్నారు. కానీ వారి పోరాటాలని జగన్ ప్రభుత్వం అణిచివేసే దిశగానే ముందుకెళ్లింది..ఎప్పుడు వారి సమస్యలని తెలుసుకోలేదు.

అయితే అక్కడ వైసీపీపై వ్యతిరేకత పెరిగిందనే మాట వాస్తవం..అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇక వచ్చే ఎన్నికల్లో అన్నీ సీట్లు గెలవాలని టార్గెట్ గా పెట్టుకున్న జగన్..అమరావతి ప్రాంత పరిధిలో ఇతర ప్రాంతాల వారికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టారు. అమరావతి పరిధిలో తాడికొండ, మంగళగిరి నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ స్థానాల్లో గెలవాలని చెప్పి..ఇతర ప్రాంతాల చెందిన 50 వేల మందికి పైనే ఇళ్ల పట్టాలు అమరావతిలో కేటాయించారు. దీని ద్వారా వారు అక్కడ ఓటర్లుగా వస్తారు. అంతే తప్ప..పేదలకు ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని కాన్సెప్ట్ పెద్ద రాజకీయ స్క్రిప్ట్ అంటున్నారు.

ఇక దీన్ని అమరావతి రైతులు వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తున్నారు. రైతులని పోలీసులు ఎక్కడక్కడ జగన్ సభకు ఇబ్బంది లేకుండా వారిని కట్టడి చేస్తున్నారు. ఈ నిరసనల మధ్యనే జగన్..అమరావతిలో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. అయితే పేదలకు అనే పేరుతో వైసీపీ కార్యకర్తలకు సెంటు భూమి పట్టాలు ఇచ్చి..అమరావతి ప్రాంతంలో వైసీపీ ఓటర్లని పెంచి తమ బలాన్ని మరింత పెంచుకోవాలని జగన్ చూస్తున్నారని తెలుస్తుంది. చూడాలి మరి ఈ ఇళ్ల పట్టాల పంపిణీ వైసీపీకి ఎంతవరకు ప్లస్ అవుతుందో.