NTR: ఎన్టీఆర్ వార్ సినిమా కోసం ఎన్ని కోట్లు తీసుకున్నారో తెలుసా..?

టాలీవుడ్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమాలో నటిస్తూ ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే బాలీవుడ్లో హృతిక్ రోషన్ తో కలిసి వార్ చిత్రంలో నటించబోతున్నారు. ఈ సినిమా కూడా భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ఎన్టీఆర్ విలన్ పాత్రను పోషిస్తున్నట్లుగా సమాచారం అందుకుగాను ఏకంగా రూ.40 కోట్ల రూపాయలు రెమ్యూనరేషన్ అందుకోబోతున్నట్లు సమాచారం.

War 2 Just Got Bigger: Jr NTR To Co-Star With Hrithik Roshan
అంతేకాకుండా తెలుగు డబ్బింగ్ రైట్స్ విషయంలో కూడా ఎన్టీఆర్ లాభాలలో వాటాలను తీసుకునేందుకు ఒప్పందం కుదిరించుకున్నట్లుగా సమాచారం. ఈ స్థాయిలో ఆఫర్ను బాలీవుడ్ నుంచి దక్కించుకున్న టాలీవుడ్ హీరో ఎవరు లేరని కూడా చెప్పవచ్చు. హీరోగా ఎన్టీఆర్ వరుస సినిమాలు చేస్తున్న సమయంలో అనూహ్యంగా బాలీవుడ్ లో వార్ సినిమా కోసం విలన్ పాత్రను చేసేందుకు ఒప్పుకోవడంతో చాలా ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. ముఖ్యంగా ఎన్టీఆర్ తన సినీ కెరియర్ నుంచి నెగిటివ్ షెడ్డు ఉన్న పాత్రలలో నటించాలని ఆత్రుతగా ఉండేవారు.

అందుకోసమే వార్ సినిమాలో ఎన్టీఆర్ విలన్ గా నటించేందుకు ఒప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా భారీగా రెమ్యూనరేషన్ కూడా లభిస్తోందని సమాచారం. ఒక వేళ ఈ సినిమా హిట్ అయితే బాలీవుడ్లో ఎన్టీఆర్ బిజీ హీరోగా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. దేవర సినిమా పూర్తి అయిన తర్వాత మూడు నెలల పాటు ఎన్టీఆర్ వార్ సినిమా కోసం తన సమయాన్ని కేటాయిస్తున్నట్లు సమాచారం. ఆ తర్వాత డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో మరొక సినిమా చేయబోతున్నారు.

Share post:

Latest